గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మళ్ళి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. గత రెండు నెలల్లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయ్. మొన్నటివరకు పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు 20 రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. 

 

రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర మొన్నటి వరుకు 80 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు 20 రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు శనివారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 6 పైసల చొప్పున తగ్గగా... డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 6 పైసలు తగ్గుదలతో రూ. 77.85కు చేరగా, డీజల్ ధర 5 పైసలు తగ్గుదలతో 72.22 రూపాయలకు చేరింది.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. ఇది వాహనదారులకు శుభ వార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: