అవును.. 3 రోజుల నుండి పెరుగుతున్న పెట్రోల్, డీజిలు ధరలకు ఈరోజు బ్రేకులు పడ్డాయి.. ఎన్నడు లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేకులు పడ్డాయి. రెండు నెలల నుండి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రోజుల నుండి పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పెట్రోల్, డీజిల్ ధరలకు కూడా బ్రేకులు పడ్డాయి. 

 

ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 76.52 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 70.48 రూపాయిల వద్ద నిలకడగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.94 వద్ద, డీజిల్ ధర రూ.64.77 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబయిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.77.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.93కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై నాలుగు రూపాయిలు తగ్గింది. ఏది ఏమైనా పెట్రోల్ డీజిల్ దరల పెరుగుదలకు బ్రేకులు పడటం వాహనదారులకు మంచి విషయం అనే చెప్పలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: