పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. మార్కెట్ నిపుణులు చెప్పినట్టే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గి వాహనదారులకు ఉరటనిస్తున్నాయి. గత రెండు నెలలుగా రోజుకు 10 పైసలు, 20 పైసలు తగ్గుతూ భారీగా తగ్గాయి. కేవలం రెండు నెలల్లో దాదాపు ఆరు రూపాయిలు తగ్గింది. అలానే ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా భారీగా తగ్గింది. 

 

నేడు బుధవారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 5 పైసలు తగ్గుదలతో 75.94 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 8 పైసలు తగ్గుదలతో 69.71 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర రూ.64.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయిలు తగ్గింది అంటే మాములు శుభవార్త.

మరింత సమాచారం తెలుసుకోండి: