చమురు ధరలు ప‌డిపోవ‌డం , అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మంగ‌ళ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌న‌మయ్యాయి. స్టాకు మార్కెట్లు  నష్టాలతోనే  ట్రేడింగ్‌ను ఆరంభించ‌డం గ‌మ‌నార్హం. దీనికితోడు స‌మీప భ‌విష్య‌త్‌లో అమెరికాలో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డేట్లు క‌న‌బ‌డ‌టం లేద‌న్న వార్త‌లు కూడా మార్కెట్లను దెబ్బ‌తీసిన‌ట్లుగా ట్రేడింగ్ నిపుణులు చెబుతున్నారు. ట్రేడింగ్ ప్రారంభం కావ‌డానికి ముందు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు కూడా మ‌దుప‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేశాయి.  తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధించనున్నామని  అమెరికా అధ్యక్షుడి ట్రంప్‌ ప్రకటన మదుపర్ల‌ సెంటిమెంటును దెబ్బతీసింది.  


దాదాపు అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ప్ర‌ధానంగా  ఆయిల్,బ్యాంకింగ్, మెటల్  రంగాల  షేర్లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, సిప్లా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఐటీసీ లిమిటెడ్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్  షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్‌, వేదాంత, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, హిందాల్కో,  ఇండ్‌స్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలను మూట‌గ‌ట్టుకున్నాయి. దేశీయ స్టాక్ ఎక్సేజీల ట్రేడింగ్ ఈ విధంగా సాగాయి. సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 9,100 దిగువకు చేరుకున్నాయి.  ఉదయం 9.52 గంటల సమయంలో సెన్సెక్స్‌ 829 పాయింట్లు కోల్పోయి 30,826 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయింది.

 

 ప్ర‌స్తుతం 9,029 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.91 వద్ద ట్రేడవుతోంది. వాస్త‌వానికి అంత‌ర్జాతీయంగా దాదాపుగా అన్ని స్టాకు మార్కెట్లలో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేత‌కు మ‌రికొంత కాలం చూడాల‌న్న‌దే చాలాదేశాల అభిప్రాయంగా తెలుస్తోంద‌ని వెల్ల‌డిస్తున్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా తొలిసారిగా సోమవారం బ్యారల్‌ ధర ఓ దశలో -37.63 డాలర్లకు తగ్గిపోయింది. అంటే సరకు వదిలించుకోవడానికి విక్రేతే కొన్నవారికి ఎంతోకొంత ఎదురు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొన‌డం గ‌మ‌నార్హం.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: