కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న సమయంలో వ్యాపారులు ప్రజలను దోచుకున్నారు. అధిక ధరలతో నిత్యావసరాలు విక్రయిస్తూ వినియోగ‌దారుల జేబుల‌కు భారీగా చిల్లు పెట్టారు. నిత్యవసర వస్తువులతో పాటు ఇతర వస్తువులను అధికంగా అమ్మారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిత్యవసరా వస్తువులను అధికంగా అమ్మితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న ధరలు ప్రస్తుతం ఎందుకు అమలు కావడం లేదనే చిల్లర దుకాణాల యజమానులను అడిగితే సరుకు రావడం లేదని దొంగ సాకులు చెబుతున్నారు.

 

వాస్త‌వంలో మాత్రం వ‌స్తువుల స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఆట‌కం లేద‌న్న‌ది వాస్త‌వం. రూ. 900 నుంచి వెయ్యి వ‌ర‌కు  అమ్మిన 25 కేజిల బియ్యం బస్తా ప్ర‌స్తుతం మార్కెట్లో  రూ.1100 నుంచి 1200 వ‌ర‌కు అమ్ముతుండ‌టం గ‌మ‌నార్హం. లాక్‌డౌన్‌ ముందు కేజి ఉల్లిపాయలు రూ.25 ఉండగా ఆదివారం రూ.35 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.  కేజి రూ.40లు ఉన్న బెల్లం రూ.50లు అమ్ముతు న్నారు. ఇదిలా ఉండ‌గా లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్​ ఫోరమ్​కు ఫిర్యాదులు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం.  ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 1967కు , వాట్సప్ నంబర్ 7330774444కు  అక్ష‌రాల‌ లక్షకు పైగా ఫిర్యాదులు చేయ‌డం విశేషం. 

 

లాక్‌డౌన్ స‌మ‌యంలో అధిక ధ‌ర‌ల‌కు వ్యాపారులు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను విక్ర‌యిస్తార‌న్న స‌మాచారం ప‌సిగ‌ట్టిన‌
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అందుకు అనుగుణంగానే ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ఫోరమ్​ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫోన్, వాట్సప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే ఎన్ ఫోర్స్ మెంట్, తూనికలు కొలతల శాఖ అధికారులకు పంపుతున్నారు. అయితే ఇంత పెద్ద సంఖ్య‌లో ఫిర్యాదులు రావ‌డాన్ని అధికారులు ఊహించి ఉండ‌రు. వీట‌న్నింటికి ఏవిధంగా ప‌రిష్కారం చూపుతారో..ఎంత‌మంది వ్యాపారులపై చ‌ర్య‌లు తీసుకుంటారో అన్న‌ది వేచి చూడాలి.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: