క‌రోనా వైర‌స్ గ‌ల్ఫ‌దేశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచం మొత్తం ష‌ట్‌డౌన్గా మార‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించింది. దీంతో పెట్రో, డీజిల్‌కు డిమాండ్ లేకుండాపోయింది. ఫ‌లితంగా క్రుడాయిల్ ధ‌ర‌లు మునుపెన్న‌డూ లేనంతంగా ప‌డిపోయాయి. కోవిడ్‌-19 దెబ్బకు క్రూడాయిల్‌ మార్కెట్‌  కుప్పకూలింది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఏకంగా 244 శాతానికి పైగా పడిపోయింది. ఒక ద‌శ‌లో వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ, నైమెక్స్‌) రకం బ్యారల్‌ క్రూడాయిల్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్ట్‌ ధర ఏకంగా 244 శాతానికి పైగా క్షీణించి -26.24 డాలర్లకు  పడిపోయింది. గల్ఫ్‌ యుద్ద సమయంలోనూ ఈ స్థాయి ధరలు నమోదు కాక‌పోవ‌డం గమనార్హం. 

 

అయితే దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచ‌డం విశేషం. భార‌త్‌తో పాటు ప‌లు దేశాల్లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు చేయ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ క్ర‌మంగా మెరుగు ప‌డుతోంది. దీంతో పెట్రోల్‌కు డిమాండ్ ఏర్ప‌డింది. అలాగే క్రూడాయిల్ కూడా బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు.. చమురు ధరలపై లీటర్‌కు 60 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్ర‌స్తుతం  ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

 

న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.71.86, డీజిల్ రూ.69.99, బెంగళూరులో పెట్రోల్ లీటర్ రూ .74.18, డీజిల్ రూ.66.54, చెన్నైలో పెట్రోల్ లీటర్ 76.07, డీజిల్ రూ.68.74, ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.78.91, డీజిల్ రూ.68.79,విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.74.86, డీజిల్ రూ68.76, : హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్ రూ.74.61, డీజిల్ రూ.68.42గా ఉన్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: