జియో మార్ట్.. ఏంటి ఈ మార్ట్ అని అనుకుంటున్నారా? అదేనండీ.. దిగ్గజ టెలికామ్ సంస్ద రిలియన్స్ జియో మార్ట్ పేరుతో కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో సులువుగా కొనుగోలు చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ జియో మార్ట్ సేవలు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 30 పట్టణాలు, నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రవేశపెట్టినట్లుగా రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

 

IHG

 

ఇకపోతే ఈ జియో మార్ట్ వెబ్ సైట్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు అని తెలిపింది. కేవలం నిత్యావసర సరుకులే కాదు పళ్ళు, కూరగాయలు, కూల్ డ్రింకులు లాంటి ఇతర సామగ్రిని అంత మార్ట్ లో అందుబాటులో ఉంచినట్టు సంస్ద వెల్లడించింది. అయితే ఇక్క ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే? ఎంఆర్పీ కంటే కూడా 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలియజేసింది. 

 

IHG

 

ఇంకా ఈ జియో మార్ట్ లో ఎన్నో ఆర్డర్లు చేస్తున్నారు. అయితే ఈ ఆర్డర్ డెలివరీ అంతటి రెండు రోజులు సమయం అని చెప్పినప్పటికీ అంతకంటే ముందుగానే డెలివరీ చేస్తున్నారు. ఇంకా ఈ జియో మార్ట్ ద్వారా చిన్న వ్యాపారులకు లాభాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నిజానికి ఇప్పటివరకు ఉండే డెలివరీ సంస్దలు అన్ని కూడా బ్రాండెడ్ రత్నదీప్, మోర్, డి-మార్ట్ వంటి వాటిలోనే తీసుకునేది. ఐతే ఇప్పుడు చిన్న చిన్న స్టోర్లలో కూడా ఈ జియో డెలివరీ యాప్ పని చేసే అవకాశం ఎక్కువగా ఉంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: