రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కుదేల‌వ‌డంతో ఈ రంగంపై ఆధార‌ప‌డిన ఎంతోమంది బ్రోక‌ర్ల‌కు ఉపాధి లేకుండా పోయింది. మిగ‌తా రంగాల‌తో పోల్చితే ఈ రంగంలో ఈజీగా మ‌ని సంపాదించేందుకు అవ‌కాశం ఉంది. ఈజీగా డబ్బులు వచ్చేది ఏదంటే ఒక్క భూ దందాయే.. అంతకు మించిన మార్గమేదీ మన కళ్ల ముందు కనబడదు.  కరోనా వైరస్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశం కనిపించడం లేదు. మూడు నెలలుగా లావాదేవీలు నిలిచ‌పోవ‌డంతో ఈ రంగంపై ఆధార‌ప‌డిన ఎంతో బ్రోక‌ర్లు, వ్యాపారుల‌కు క‌మీష‌న్లు ముట్ట‌డం లేదు. హైదరాబాద్, దాని శివార్ల‌ల‌లోని వెంచ‌ర్లు వెల‌వెల‌బోయి క‌నిపిస్తున్నాయి. వాస్తావానికి సాధార‌ణంగా నిత్యం కొనుగోలు చేయాల‌నుకుంటున్న  సంద‌ర్శ‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండేంది. అయితే కరోనాకు ముందు, తర్వాత అన్న‌ట్లుగా మారింది రియ‌ల్ వ్యాపారం. 


క‌రోనాకు ముందు హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌లా ఎక్క‌డ చూసినా ఇంటి నిర్మాణానికి అవసరమయిన వెంచర్లు వేస్తూ కనిపించేవారు. భూ యజమాని, రియల్టర్లు, బ్రోకర్లతో సందడిగా ఉండేది. లావాదేవీలు బాగా జరుగుతుండటంతో యజమాని నుంచి రియల్టర్లు అందరూ చెరగని చిరునవ్వుతో కనిపించేవారు. మరిప్పుడు.. కరోనా పుణ్యమా అని ఆ పరిస్థితి లేదు. రూ.కోట్లు పెట్టుబడి పెటి ్టన వారు గొల్లుమంటున్నారు. ఇది ఒక కడపకే పరిమితం కాలేదు. ఎన్నికల ముందు నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌, ఉప సంహరణపై అప్పట్లో ఆంక్షలు ఉండడం, బ్యాంకులపై కొన్ని రూమర్లు రావడంతో జనం డ బ్బులను రియల్‌ ఎస్టేట్‌ వైపు మళ్లించి  భూములు, నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టారు. 

 

కరోనాకు ముందు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ఊర్లో రియల్ ఎస్టేట్ దందా అసాధారణ స్థాయిలో కనిపించ‌డం గ‌మ‌నార్హం. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు విజయవాడ హైవేలో నల్లగొండ వరకు, యాదాద్రి జిల్లా మొత్తం, నల్లగొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో సాగు భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతుండేవి. అలాగే శంకర్ పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహింపట్నం, మేడ్చల్, శామీర్ పేట, ఘట్ కేసర్, కీసర, యాచారం మండలాల్లో కూడా రియ‌ల్ వ్యాపారం ఎక్కువ‌గానే ఉంటుంది. మొన్నటి దాకా ప్లాట్లు, భూములు విక్రయించగా వచ్చిన కమీషన్లతో రాజాల్లాగా బతికిన వాళ్లకు మరో పని చేతగాక, ఆ పని ముందుకు సాగక ఇబ్బంది పడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: