ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. ఈ బ్యాంక్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే అద్భుతమైన ఆఫర్లను తీసుకువస్తుంటుంది. ఇంకా అలానే ఇప్పుడు కూడా సూపర్ డూపర్ ఆఫర్లు వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఆ ఆఫర్లు చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. అలాంటి అద్భుతమైన ఆఫర్లు ఇవి. 

 

ఇంకా ఆ ఆఫర్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఇంటర్నెట్ బ్యాంకింగ్ బొనాంజా పేరుతో బ్యాంక్ చాలా ఆఫర్లు తీసుకువచ్చింది. కస్టమర్లు ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సహా ఐమొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లు అందిస్తున్నారు. 

 

ఇంకా ఆ ఆఫర్లు ఏంటి అంటే? ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ కొనుగోలపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు. అంటే మీరు 50 వేల సరుకు కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. అయితే ఈ అద్భుతమైన ఆఫర్ పొందేందుకు కనీసం రూ.15,000 కొనుగోలు చేయాలి. 

 

అంతేకాదు హిటాచీ ప్రొడక్టులపైనా కూడా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే ఇందులో రూ.3,000 వరకు మాత్రమే క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ అద్భుతమైనా ఆఫర్లు ఈనెల చివరి వరకు ఉంటాయి. ఇంకా పారెంట్‌లేన్ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. 

 

ఇక మోటరోలా ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌పై అయితే ఈ ఐసీఐసీఐ ఏకంగా రూ.7,500 ఫ్లాట్ తగ్గింపు ఇస్తుంది. ఇంకా ఈ ఆఫర్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండనుంది. అంటే ఈ నెల 18 వరకే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఆన్లైన్ గ్రాసరీ షాపింగ్ జొమాటోలో అయితే ఏకంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నారు. 

 

ఈ నెలఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ఐసీఐసీఐ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై 5 రెట్లుకుపైగా పాయింట్లు లభిస్తాయి. ఈ ఆఫర్లు మాత్రమే కాదు ఇంకా ఎన్నో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయ్. పూర్తి ఆఫర్లు తెలుసుకోవాలి అనుకుంటే ఐసీఐసీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆఫర్లు గురించి పూర్తిగా తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: