కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లిందని, లాక్‌డౌన్ దెబ్బకు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించిపోవడంతో నిరుద్యోగం సైతం పెరిగిపోయిందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఛైర్మన్ హెన్రీ మెక్‌కినెల్ అభిప్రాయ‌ప‌డ్డారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గితేనే ఆర్థిక పునరుద్ధరణ సాధ్యపడుతుందని హెన్రీ మెక్‌కినెల్ తెలిపారు.కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరలో వస్తుందని ఆశిస్తున్నామని, కానీ వాస్తవానికి ఊహించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా వచ్చేలా కనబడుతోందని హెన్రీ తెలిపారు. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ చైర్మన్ హెన్రీ మెకిన్నెల్ ఫైనాన్షియల్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో కరోనాతో పోరాడటానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం ఉందని, భారత్ లాంటి జనసాంద్రత కలిగిన దేశంలో సామాజిక దూరం కష్టమని అని అన్నారు. 

 

భారత్ లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో భౌతిక దూరం కష్టమని, కరోనాను అధిగమించేందుకు వ్యాక్సిన్ ఒకటే మార్గమని హెన్రీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ దేశ ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని నిర్ణయిస్తుందని, కరోనా వైరస్ నియంత్రణ ఆర్థిక కార్యకలాపాల వేగానికి పెద్ద సవాలుగా నిలువనుందని హెన్రీ పేర్కొన్నారు.  కరోనా వైరస్ ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితిలో, ఈ వైరస్ నియంత్రణ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసే లేదా మెరుగుపరిచే పరిస్థితి అయితే, భారతదేశం చాలా పెద్ద సవాలును ఎదుర్కొంటుంద‌న్నారు. 

 

ప్రాణాంతక మహమ్మారికి వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు. కాగా, మూడీస్ సంస్థ భారత్ క్రెడిట్ రేటింగ్‌ను బీఏఏ3కి తగ్గించింది, అలాగే నెగెటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.2 శాతం కుదించుకుపోతుందని.. గత 150 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా పతనమవుతుందని ప్రపంచ బ్యాంకు జోస్యం చెప్పింది. ఆ నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాలు దశాబ్దాలు శ్రమించి సాధించిన పురోగతిని కరోనావైరస్ కాలరాస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవ్యవస్థలను మాంద్యంలోకి పడదోస్తోంది. ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవంలో భారతదేశానికి ‘పరిమిత పాత్ర’ పోషించే అవకాశం ఈ కరోనా సంక్షోభం కల్పించిందని భారత పరిశీలకులు భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: