భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మన దేశంలో చైనా వస్తువులపై బ్యాన్ కొనసాగుతుంది. చైనా అంటే చాలు ప్రజలు చిరాకు పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా చైనాకు సంబంధించిన 59 యాప్స్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే చైనా నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఈ కామర్స్ సంస్దలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఈ కామర్స్ సైట్స్ లో ప్రొడక్ట్ ఎక్కడ తయారైందనే అంశాన్ని కచ్చితంగా తెలియజేయాలని పేర్కొంది. ఇంకా ఇప్పుడు ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి ఝలక్ ఇచ్చింది. 

 

IHG' data with third parties: Paytm

 

మొబైల్ హ్యాండ్‌సెట్ వినియోగదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి. చార్జర్లు, స్క్రీన్ గార్డ్, ఫోన్ బ్యాక్ కవర్, కేబుల్ వంటివి పలు మొబైల్ యాక్ససిరీస్ ప్రియం అయ్యాయి. ఇంకా వీటిపైన ఏకంగా 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగాయి. చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. 

 

IHG

 

కాగా భారత్ మొబైల్ యాక్ససిరీస్ కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడింది. ఇంకా ప్రస్తుతం యాంటీ చైనా సెంటిమెంట్ తో చాలా మంది ట్రేడర్లు వారి ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో మొబైల్ యాక్ససిరీస్ ధరలు భారీగా పెరుగుతూన్నాయి. జీఎస్‌టీ పెరుగుదల, దిగుమతులు తగ్గిపోవడంతో స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా 10 నుంచి 15 శాతం వరకు పెరిగాయి. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: