" భారత దేశం లో నే ఇంకొన్నాళ్ళు ఉంది దేశానికి సేవలు అందించాలి అని అనుకున్నాను .. కానీ మోడీ ప్రభుత్వం తో నాకు సరైన అగ్రిమెంట్ కుదరలేదు. " అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్. తన పదవీ కాలాన్ని ఎల్లుండి తో పూర్తి చేసుకోబోతున్న ఆయన ఆ పదవి ని ఉర్జిత్ పటేల్ కి అప్పగించ బోతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి లో మీడియా తో మాట్లాడిన ఆయన తాను అనుకున్నది ఇంకా పూర్తి కాలేదు అనీ ఇంకా కొన్నాళ్ళు ఉండడం తన లక్ష్యం అన్నారు. కనీ దానికి సంబంధించిన చర్చలు సఫలం కాలేదు అని వాపోయారు రాజన్.  "ఇక్కడ నేను చేయాలనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇంకొంత కాలం ఉండాలని అనుకున్నా. కానీ అందుకు తగ్గ చర్చలు సాగలేదు. ఇక ఆ విషయం ముగిసింది" అని అన్నారు. మూడేళ్ళ పదవీ కాలం తనని పోడిగించాలి అని న్యూస్ వచ్చినా అది కొద్ది రోజుల తరవాత ఆగిపోయింది అన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందని గతంలో తాను చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని సైతం రాజన్ సమర్థించుకున్నారు. అప్పటి పరిస్థితి అటువంటిదేనని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: