కష్టమైన విధాన నిర్ణయాలు తీసుకుంటూ , వృద్ధి ప్రభావితం అవ్వడం కోసం ఎక్కువగా శ్రమించిన తనకి రెండో అవకాశం ఇవ్వకపోవడం మీద నరేంద్ర మోడీ
సర్కారుని ఎందుకు నిందిస్తున్నారు అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్కోప్పడ్డారు. సంస్కరణలు అమలు వేగవంతం చేసేందుకు వడ్డీ రెట్లు తగ్గించడం
మాత్రమే సరైన ఉపాయం అంటే అది తాను నమ్మను అన్నారు ఆయన. తన పదవి విడిచిన తరవాత ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన రాజన్ తన సందేశాన్ని
అందించారు. భారత దేశం లో బ్యాంక్ లని ఒక్కొక్కటీ సరిదిద్దే విధానం సాగుతోంది అని అభిప్రాయ పడిన ఆయన రాబోయే కొత్త గవర్నర్ దాన్ని
సమర్ధవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇదివరకు బ్యాంకులు ఎలా పడితే అలా రుణాలు ఇవ్వడం , వాటిని వెనక్కి తీసుకునే క్రమంలో తలనొప్పులు
తెచ్చుకోవడం ఉండేది అని ఇప్పుడలా లేదు అని అన్నారు రాజన్. బ్యాంకు ఆస్తుల నాణ్యతపై సమీక్షలు జరుగుతున్నాయని సెప్టెంబర్ 2013లో 4.2 శాతంగా ఉన్న
బ్యాంకుల నిరర్థక ఆస్తుల శాతం ఇప్పుడు 7.6 శాతానికి పెరిగిందని, మొత్తం 14.5 శాతం విలువైన బ్యాంకు రుణాలు ఒత్తిడిలో ఉన్నాయని గుర్తు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: