కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత.. నగదు కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఏటీఎంల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెట్రోలు బంకులు, బిగ్ బజార్లలో డెబిట్ కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకునే అవకాశం కల్పించగా, ఇప్పుడు తాజాగా ఐనాక్స్ లలో కూడా ఇలాగే కార్డు స్వైప్ చేసి రూ. 2వేలు తీసుకోవచ్చని ప్రకటించారు.