నానో టెక్నాల‌జీ పుణ్య‌మాని చిన్న ప‌రిమాణాల్లో ఎక్కువ డేటాను భ‌ద్ర‌ప‌ర‌చ‌గ‌ల మెమొరీ చిప్‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సాన్ డిస్క్ వారు త‌యారుచేసిన 400 జీబీ మైక్రో ఎస్‌డీ కార్డు ప్ర‌పంచంలో అత్య‌ధిక స్టోరేజీ గ‌ల మెమొరీ కార్డుగా ఉండేది. ఈ మైక్రో ఎస్‌డీ కార్డును యూకేకు చెందిన ఇంటెగ్రల్ మెమొరీ పీఎల్‌సీ అనే కంపెనీ విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యధిక స్టోరేజ్ కలిగిన మైక్రో ఎస్‌డీ కార్డు.

ఈ కార్డు స్టోరేజ్ కెపాసిటీ 512 జీబీ(హాఫ్ టెరాబైట్). ఇంతకుముందు సాన్ డిస్క్ సంస్థ 400 జీబీ కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్‌డీ కార్డును విడుదల చేసింది. దీని కెపాసిటీ 512 జీబీ. క్లాస్ 10 స్పెసిఫికేషన్స్‌తో తయారు చేయబడిన ఈ కార్డులో డేటాను 10 ఎంబీపీఎస్ పెర్ సెకండ్ స్పీడ్‌తో రైట్ చేసుకోవచ్చు. అలాగే గరిష్టంగా 80 ఎంబీపీఎస్ పెర్ సెకండ్ రైట్ స్పీడ్‌ను ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది.

5 సంవత్సరాల వారంటీతో ఈ కార్డు యూజర్లకు లభ్యం కానుంది.ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కార్డును మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే, దీని ధరకు సంబంధించిన‌ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
 



మరింత సమాచారం తెలుసుకోండి: