గత కొన్ని రోజులుగా వరస లాభాలతో కొత్త గరిష్టాలను అందుకున్న స్టాక్‌మార్కెట్లు కాస్త జోరందుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల అండతో ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన సూచీలు లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 10,500 పైన స్థిరపడింది.అంతర్జాతీయ మార్కెట్లలో తిరోగమన ప్రభావంతో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి.  మార్కెట్ ప్రారంభమైన నుంచే సూచీలు నష్టాల బాటపట్టాయి.

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. అయితే ఆ తర్వాత కాసేపు ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. రోజంతా లాభాల్లోనే పయనించింది. చివరి గంటల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో 295 పాయింట్లు ఎగబాకిన సూచీ 34,300 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 10,540 వద్ద ముగిసింది.  టాటాస్టీల్‌, అరబిందో ఫార్మా, యూపీఎల్‌ లిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం, భారత ఇన్‌ఫ్రాటెల్‌, టెక్‌ మహింద్రా షేర్లు నష్టపోయాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: