సాధారణంగా ట్రైన్ ప్రయాణం అంటే..ఫస్ట్ క్లాస్, ఏసీ బొగీల్లో ప్రయాణించే వారికి కాస్త ఎక్కువ వసతులు కల్పిస్తారు.  అదే మరి ఫైవ్ స్టార్ లెవెల్లో ట్రైన్లో వసతులు కల్పిస్తే..ఇంకేముంది ఒక్కసారైనా ఆ ట్రైన్ ఎక్కితే బాగుంటుందనిపిస్తుంది.  ఇప్పుడు ఆ కల నెరవేర బోతుంది. భారత్‌లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ కలుపుతూ ఈ లగ్జరీ టూరిస్ట్‌ రైలును అందుబాటులోకి వచ్చింది.

లగ్జరీ రూం.. బార్‌.. జిమ్‌ సెంటర్‌.. స్పా.. లగ్జరీ రెస్టారెంట్లు‌.. ఇలా ఒక్కటేమిటి? అన్ని రకాల హైఫై వసతులు ఈ ట్రైన్ లో ఏర్పాటు చేశారు. దేశీయ రైల్వే లాంచ్‌ చేసిన గోల్డెన్‌ ఛారియట్‌ అనే రైలులో ఈ సదుపాయాలన్నింటిన్నీ అందిస్తోంది.

కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పుదేచ్చేరి వంటి ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలన్నింటిన్నీ ఈ రైలులో చుట్టేయొచ్చు. మొత్తం 19 కోచ్‌లున్న ఈ రైలు, పర్‌పుల్‌, గోల్డ్‌ రంగుల్లో రూపొందింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: