సాధారణంగా ఎంత ఖరీదైన ఫోన్ అయినా..దానికి కొంత టైమ్ ఉంటుంది..ఆ తర్వాత డిస్ ప్లే ప్రాబ్లమ్స్..ఇతర టెక్నికల్ ప్రాబ్లామ్స్ రావడం చూస్తుంటాం. అయితే వాటిని సెకండ్ హ్యాండ్ కి అమ్మేయడమో..లేద పక్కన బెట్టడమో జరుగుతుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా ? పాత ఫోన్‌ను అమ్మాల‌ని చూస్తున్నారా ? అయితే అందుకు మీకు షియోమీ ఒక బంపర్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ది. మీరు వాడుతున్న పాత 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి దానికి బ‌దులుగా కొత్త షియోమీ స్మార్ట్‌ఫోన్‌ను పొంద‌వ‌చ్చు. 

ఈ మద్య ఆన్ లైన్ లో అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ అవ‌కాశాన్ని షియోమీ త‌న ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో అంద‌జేస్తున్న‌ది.  వినియోగ‌దారులు త‌మ పాత 4జీ ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త షియోమీ ఫోన్‌ను కొనాలంటే https://www.mi.com/in/miexchange/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.  అయితే ఫోన్లపై ఎలాంటి గీతలు, పగుళ్లు ఉండకూడదు. అంతే కాదు  మీ ఫోన్ కంపెనీ, మోడ‌ల్‌ను ఎంచుకోవాలి.  ఆన్ లైన్ లో వచ్చే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌ను యాక్సెప్ట్ చేయాలి.

అనంతం మీకు మీ ఫోన్ అమ్మ‌కానికి విలువైన కూప‌న్‌ను క్రెడిట్ చేస్తారు. అయితే ఫోన్‌ను డెలివ‌రీ తీసుకునే స‌మయంలో మీరు అమ్మ‌ద‌ల‌చిన పాత ఫోన్‌ను ఇవ్వాలి. దాన్ని ప‌రీక్షించాకే తుది నిర్ణ‌యం తీసుకుంటారు. అక్క‌డ ఫోన్‌ ఓకే అనుకుంటేనే మీకు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తారు. కొత్త షియోమీ ఫోన్ ఇస్తారు. లేదంటే ఆర్డ‌ర్ క్యాన్సిల్ అవుతుంది. పాత 4జీ స్మార్ట్‌ఫోన్‌ను వాడ‌లేని వారు కొత్త‌గా షియోమీ ఫోన్‌ను ట్రై చేయాల‌నుకుంటే ఈ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ప‌నికొస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: