చైనా మొబైల్‌ కంపెనీ హువాయ్  పి20 సిరీస్ లో రెండు కొత్త  మోడళ్లను మంగళవారం  భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.  ఎంతో ఆసక్తి నెలకొన్న హువావే పి20 ప్రో, పి20 లైట్ స్మార్ట్ ఫోన్లలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిలో పి20 ప్రో మూడు కెమెరాలతో ఉండడం విశేషం. పి20 ప్రో మోడల్ లో 40 20 8 మెగా పిక్సల్ కెమెరాలు ఉంటాయి.

జర్మనీకి చెందిన లీకా అనే కంపెనీతో కలసి కెమెరాలను అభివృద్ధి చేసింది. ముందు భాగంలో 24 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు.అమెజాన్ డాట్ ఇన్ లో  మే 3వ తేదీ నుంచి  విక్రయాలు ప్రారంభం కానున్నాయి.  ప్రీ 20 ప్రొ,  ప్రీ 20 లైట్‌ పేరుతో  రెండు స్మార్ట్‌ఫోన్లను  అందుబాటులో ఉంచింది.  ప్రీ 20 ప్రొ ధర రూ.64,999 గాను,  పీ 20 లైట్‌ ధర 19,999 రూపాయలుగానూ కంపెనీ నిర్ణయించింది.

Image result for హువావే పి20 ప్రో

పీ 20 ప్రో ఫీచర్లు :
6.1 అంగుళాల డిస్ ప్లే
1080x2240 రిజల్యూషన్‌
హైసిలికాన్ కిరిన్ 970 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజీ
40+ 20+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 పీ 20 లైట్‌ ఫీచర్లు
5.84 పుల్‌హెచ్‌డీస్క్రీన్‌ 19.9ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే
హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
16+2ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: