అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసినా ఒపెక్‌ దేశాల నుంచి స్పందన లేదు. అమెరికా మార్కెట్లలో ఆయిల్‌ రిగ్స్‌ పెరిగినా ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 2014 నవంబర్‌ తరవాత అంతర్జాతీయ మార్కెట్‌ ముడి చమురు ధరల బ్రెంట్‌ 75.53 డాలర్లకు, క్రూడ్‌ ధర 70 డాలర్లను దాటింది. మరోవైపు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్న ఒపెక్ దేశాల ప్రభావం కూడా పడుతోందని, ఈ కారణంతోనే ఈ సంవత్సరం క్రూడాయిల్ ధరలు 12 శాతానికి పైగా పెరిగాయని తెలుస్తోంది.

క్రూడాయిల్ ధర బ్యారల్ కు 60 నుంచి 65 డాలర్ల మధ్య ఉంటే అది సంతృప్తికరమని ట్రేడర్లు భావిస్తుండగా, సమీప భవిష్యత్తులోనే బ్యారల్ ధర 80 డాలర్లకు చేరినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఇక వచ్చే నెలలో వియన్నాలో జరిగే ఒపెక్ కీలక సమావేశంలో బ్యారల్ క్రూడాయిల్ ధరను 80 డాలర్లకు పెంచడమే లక్ష్యంగా సౌదీ అరేబియా కొన్ని నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉండటంతోనే ఫ్యూచర్స్ పై ఒత్తిడి అధికంగా ఉందని సమాచారం.  వెనిజులాలో అంతర్గత గొడవల కారనంగా ముడి చమురు తగ్గే అవకాశముంది. కాని అమెరికాలో ఉత్పత్తి పెరుగోతంది.
Image result for excise-duty-reduction-on-petrol
ఈ నేపత్యంలో ఇరాన్‌ పై అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న వార్తలే ధరలు ప్రభావితం చేస్తున్నాయి.ముడి చమురుపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం ప్రస్తుతం సుంకాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్‌ పూర్తయిన రోజు నుంచే తగ్గింపు అమల్లోకి రావొచ్చు. ఇక వెస్ట్ టెక్సాస్ లో జూన్ డెలివరీ క్రూడాయిల్ కాంట్రాక్టు ధర 97 సెంట్లు పెరిగి 70.69 డాలర్లకు చేరగా, న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ లో ఈ ధర 70.47 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో కాస్తంత నాణ్యతతో ఉండే బ్రెంట్ క్రూడాయిల్ ధర 91 సెంట్లు పెరిగి 75.78 డాలర్లకు చేరింది. ఈ ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆందోళనను ఆయిల్ మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: