ప్రస్తుతం వేసవి సెలవులు కావడం..ఎక్కువ శుభకార్యాలు జరుగుతుండటంతో..బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.  నెల రోజుల క్రితం రూ. 29 వేలపై ఉన్న బంగారం ఈ నెల రూ.32 వేలకు చేరింది. బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 430 రూపాయల మేర పడిపోయాయి.

స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో, బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 430 రూపాయలు తగ్గి రూ.32,020గా నమోదైంది.  అంతే కాదు  సిల్వర్‌ ధరలు సైతం కేజీకి 250 రూపాయలు తగ్గి రూ.40,650గా నమోదయ్యాయి.

అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్టు తెలిసింది.అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, డాలర్‌ బలపడటంతో బంగారం ధర అంతర్జాతీయంగా ఈ ఏడాది కనిష్ట స్థాయిల్లో ఔన్స్‌కు 1290.30 డాలర్లను నమోదుచేసింది. సిల్వర్‌ కూడా అంతర్జాతీయంగా 1.52 శాతం తగ్గి, ఔన్స్‌కు 16.24 డాలర్లగా ఉంది.నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు 165 రూపాయలు లాభపడిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: