పరారిలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13 వేల కోట్ల మోసం చేసిన కేసులో లండన్‌లో అరస్టైన నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వడానికి బ్రిటన్‌లోని కోర్టు నిరాకరించింది. వ‌రుస‌గా మూడో సారి ఆయ‌న‌కు చుక్కెదురు అయింది. నీర‌వ్ త‌ర‌ఫు న్యాయ‌వాదికి షాక్ తగిలింది.


48 ఏళ్ల‌ వయస్సు కలిగిన నీరవ్ మోదీ బుధవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్ట్‌ర్ కోర్టు ముందుకు హాజరయ్యారు. నీరవ్ మోదీ తరుఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది..బెయిల్ సెక్యూరిటీ కింద 2 మిలియన్ పౌండ్లు ఇస్తామనగా న్యాయమూర్తి ఆర్బుత్నట్ అంగీకరించలేదు. కేవలం 2 మిలియన్ పౌండ్ల పూచీకత్తుపై నీరవ్‌ను విడిచి పెట్టలేమని, బెయిల్ ఇస్తే తిరిగి వస్తార న్న నమ్మకం లేదని అన్నారు. ప్రస్తుతం నీరవ్ మోదీ ఉన్న వాండ్స్‌వర్థ్ జైలలో ఉండలేనని ఆయన తరుఫున వాదిస్తున్న న్యాయవాది కోర్టుకు తెలిపారు.


ఇదిలాఉండ‌గా, నీరవ్‌కు చెందిన 13 కార్లను విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి 3.29 కోట్ల మేర నిధుల సమకూరాయి. పీఎంఎల్‌ఏ కింద అరస్టైన నీవర్ మోదీ..అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై పలు కేసులు దాఖలయ్యాయి. ఈ-వేలం పాటలో విక్రయించిన 13 కార్లలో నీరవ్‌ మోదీకి చెందిన 13 వాహనాలు ఉండగా, మెహుల్ చోక్సీకి చెందిన 2 కార్లు అందుబాటులో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: