ఆధార్ కార్డు ఉప‌యోగిస్తున్న‌రా? పాన్ కార్డు క‌లిగి ఉన్నారా? అయితే మీకు మారిన నిబంధిన‌ల గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పాన్‌, ఆధార్‌కు సంబంధించి ప‌లు మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మ‌లా సీతారామ‌న్ త‌న తొలి బడ్జెట్‌లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, క్యాష్ విత్‌డ్రా, క్యాష్ డిపాజిట్‌, ఐటీఆర్ పైలింగ్  వంటి వివిధ అంశాల‌ను సంబంధించి ప‌లు మార్పుల‌ను ప్ర‌తిపాదించారు. కొత్త నిబంధ‌న‌లు ఇలా ఉన్నాయి.


- ఇక‌పై పాన్ కార్డు లేకున్నా కూడా లావాదేవీల‌ను నిర్వ‌హించొచ్చు. ఇప్ప‌టిదాకా రూ. 50 వేల‌ పైన ట్రాన్సాక్ష‌న్ల‌కు పాన్ కార్డు ఖ‌చ్చితంగా అవ‌స‌రం ఉండేది. ఈ ప్రాతిపాద‌న పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన త‌ర్వాత ప్ర‌జ‌లు మ్యూచువ‌ర్ ఫండ్స్‌, బంగారం కొనుగోలు వంటి వాటికి పాన్ బ‌దులు ఆధార్ స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. 


- బ్యాంకుల్లో రూ. 50,000కు పైన న‌గ‌దు డిపాజిట్ చేయాల‌న్నా, అలాగే క్యాష్ విత్‌డ్రా చేసుకోవాల‌న్నా కూడా త్వ‌ర‌లో ఆధార్ స‌మ‌ర్పిస్తే స‌రిపోతుంది. పాన్ కార్డు అవ‌స‌రం ఉండదు. ఇప్పుడు ఆధార్‌, పాన్ ఇంట‌ర్‌ఛేంజ‌బుల్ అంటే రెండింటిలో ఏపి ఉన్న ప‌ని జ‌రిగిపోతుంది.


- ఆధార్‌- పాన్ లింక్: ఆధార్ లింక్ సాయంతో ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్‌ (ఐటీ రిట‌ర్న్ప్‌) దాఖ‌లు చేసేవారికి ఇక‌పై ఐటీ ఆధికారులే కొత్త పాన్ కార్డును జారీ చేస్తారు. కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మ‌న్ ప్ర‌మోద్ చంద్ర ఈ విష‌యాన్ని తెలిపారు.


- పాన్ కార్డు లేనివారు కూడా ఇక‌పై రిట‌ర్న్ప్‌ను దాఖ‌లు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఆధార్‌తో ఆదాయ‌పు పన్ను రిట‌ర్న్ప్ అంశాన్ని నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు.


- ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోక‌పోయినా కూడా వ‌చ్చే న‌ష్టం లేదు. ఆధార్‌తో లింక్ చేసుకోక‌పోయినా కూడా పాన్ కార్డు డియాక్టివ్ కాదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: