మాజీ చీఫ్ జ‌స్టిస్ ఆర్ఎం లోధాను హ్యాక‌ర్లు మోసం చేశారు. న‌కిలీ మెయిల్‌తో లక్ష రూపాయ‌లు కాజేశారు. మాజీ జ‌స్టిస్ లోధా త‌రుచూ త‌న మిత్రుడు, రిటైర్డ్ జ‌డ్జి బీపీ సింగ్‌తో ఈమెయిల్ ద్వారా సంప్ర‌దింపులు చేస్తే ఉండేవారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన లోధాకు మెయిల్ వ‌చ్చింది. అర్జెంట్‌గా ల‌క్ష రూపాయ‌లు కావాలంటూ బీపీ సింగ్ అకౌంట్ నుంచి మెయిల్ వ‌చ్చింది. సోద‌రుడి చికిత్స కోసం డ‌బ్బులు కావాలంటూ ఆ మెయిల్‌లో ఉంది. అయితే మాజీ చీఫ్ జ‌స్టిస్ లోధా వెంట‌నే స్పందించారు.


రెండు ద‌ఫాల్లో మెయిల్‌లో ఉన్న అకౌంట్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. అయితే ఓ నెల రోజుల త‌ర్వాత జ‌డ్జి బీపీ సింగ్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు లోధాకు మెయిల్ వ‌చ్చింది. దీంతో తేరుకున్న లోధా వెంట‌నే ఢిల్లీ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్రయించారు. దాంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మాల‌వ్యా న‌గ‌ర్‌లో ఉన్న సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు చేశారు. చీటింగ్‌, ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. హ్యాకర్ కోసం ద‌ర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: