కావాల్సిన ప‌దార్థాలు:
బ్రెడ్ స్ల‌యిస్‌లు- ఆరు
శనగపిండి- ఒక‌ కప్పు
కారం- ఒకటిన్నర స్పూన్
గరం మసాలా- పావు స్పూన్

 

నూనె- డీప్ ఫ్రై కి త‌గినంత‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
బేకింగ్‌ సోడా- చిటికెడు
కొత్తిమీర- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ఒక బౌల్‌లో శెనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. తర్వాత అందులో బేకింగ్‌ సోడా వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. 

 

మ‌రోవైపు బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్క‌ల‌ను పిండిలో ముంచి నూనెలోకి వేయాలి. బ్రెడ్‌ పకోడీ బంగారు రంగులోకి రాగానే తీసేయాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పకోడీ రెడీ అయినట్లే. ఏదైనా సోస్‌తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: