కావాల్సిన ప‌దార్థాలు: 
పల్లీలు- రెండు కప్పులు
శనగపిండి- ఒక‌ కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్‌

 

జీర పొడి- పావు టీ స్పూన్‌
ధనియాలపొడి- అర టీ స్పూన్‌
గరంమసాలా- అర‌ టీ స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బ‌లు

 

నూనె- సరిపడా
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- రుచికి త‌గినంత‌
కారం- ఒక టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకుని పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా, జీర‌పొడి, ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు స‌రిప‌డా నీళ్లు వేసుకుని క‌లుపుకోవాలి. 

 

ఆ త‌ర్వాత అందులో వేయించుకున్న‌ పల్లీలు కూడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత పాన్ లో నూనె పోసి కాగిన తర్వాత పల్లీలను పకోడీల మాదిరిగా వేసి కరకరలాడే వరకు వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి. అంతే వేడి వేడి పల్లీ పకోడీ రెడీ. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: