కావాల్సిన ప‌దార్థాలు:
చిక్కటి పాలు- అర‌ లీటర్‌
మిల్క్‌ పౌడర్- యాబై గ్రాములు 
జీడిప‌ప్పు- ప‌ది

 

క్రీమ్- 250 గ్రాములు
పంచదార- అర క‌ప్పు
చాక్లెట్‌ బోర్నవిటా- పావు కిలో
బాదం ప‌ప్పు- ప‌ది

 

త‌యారీ విధానం: 
ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులోంది పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఆ పాలను బాగా మరగనివ్వాలి. మ‌రోవైపు ఒక‌ చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో మిల్క్‌పౌడర్‌ ఉండలు కట్టకుండా కలపాలి. దానికే పంచదార చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో కలిపి అడుగంటకుండా తిప్పుతుండాలి. 

 

అందులోనే క్రీమ్‌ కలిపి చిక్కబడే వరకు తిప్పిన తర్వాత స్టౌమీద నుండి దించి చల్లార్చాలి. చల్లారిన పాల మిశ్రమంలో చాక్లెట్‌ బోర్నవిటా కలిపి పది నిముషాలు గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో వేసి.. చివ‌రిగా పైన జీడిప‌ప్పు ముక్క‌లు, బాదం ముక్క‌లు వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్‌ను ఫ్రీజర్‌లో 8 గంటలు ఉంచితే చాక్లెట్‌ ఐస్‌ క్రీమ్‌ తయారవుతుంది. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు తీసి స‌ర్క్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువైన‌, రుచిక‌ర‌మైన చాక్లెట్‌ ఐస్‌ క్రీమ్ రెడీ అయిన‌ట్లే. ప్ర‌స్తుతం మండే ఎండ‌లు స్టాట్ అయ్యాయి. 

 

అయితే ఈ వేసవి కాలంలో ఎక్కువగా తినాలనిపించేవి ఐస్ క్రీమ్ లు. ముఖ్యంగా పిల్ల‌లు కూడా ఐస్ క్రీమ్ కావాల‌ని మారం చేస్తుంటారు. వాస్త‌వానికి వేసవికాలంలో అలా చల్లచల్లగా ఓ ఐస్ క్రీమ్ తింటే చాలు, మొత్తం కూల్ అయిపోతాం. అందుకే అన్ని కాలాల్లో కన్నా వేసవిలో దీనికి డిమాండ్ ఎక్కువ. అయితే రోజూ కొనుక్కునే తినేకన్నా ఇంట్లోనే తాజా, రుచికరమైన ఐస్ క్రీమ్ లు చేసుకుని తింటే బాగుంటుంది కదా..  అందుకే చాలా సులువుగా చేసుకునే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీ మీరు ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: