కావాల్సిన ప‌దార్థాలు:
బఠానీలు- ఒక క‌ప్పు
టమాటో ముక్క‌లు- ఒక క‌ప్పు
పచ్చిమిరప కాయలు- రెండు 

 

కారం- ఒక టీ స్పూన్‌
ధనియాల పొడి- అర టీ స్పూన్‌
జీలకర్ర- అర టీ స్పూన్‌

 

పసుపు- పావు టీ స్పూన్‌
నీళ్ళు- ఒక క‌ప్పు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు

 

అల్లంవెల్లుల్లి పేస్ట్‌- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా బ‌ఠానీలు నీటిలో రెండు గంట‌ల పాటు నాన‌బెట్టుకుని పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీల‌క‌ర్ర‌, పచ్చిమిర్చి, ట‌మాటో ముక్కులు వేసి.. పచ్చి వాసన పోయే వరకు అన్ని పదార్థాలను వేయించాలి. ప‌ది నిమిషాల త‌ర్వాత అందులో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. 

IHG

ఆతర్వాత మీడియం ఫ్లేం మీద ఐదు నిమిషాలు ఉడికించండి. మసాలా బాగా ఉడికిన తర్వాత, అందులో కొద్దిగా నీటిని కలపండి. నీరు ఉడకడం ప్రారంభమైన తర్వాత, అందులో పచ్చి బఠానీలను వేసి ప‌ది నిమిషాలపాటు ఉడికించాలి. ప‌ది నిమిషాల త‌ర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క‌లిపి ఉడికించాలి. 

IHG

గ్రేవీ చిక్కగా ఉండటానికి ఉడుకుతున్న కూరగాయలలో, కొంత భాగాన్ని మాష్ చేయండి. ఇక నూనె పైకి తేలిన‌ప్పుడు చివ‌రిగా కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆప్ చేయాలి. అంతే నోరూరించే ట‌మోటా బఠాణి కర్రీ రెడీ అయిన‌ట్లే. రైస్ లేదా రోటీతో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. సో.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: