కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి బియ్యం- అర కేజి
గోంగూర- రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టీస్పూన్‌

 

దాల్చిన చెక్క- చిన్నముక్క
ఉప్పు- రుచికి త‌గినంత‌
బిర్యాని ఆకు- రెండు

 

నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- ఐదు

 

లవంగాలు- మూడు
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా గోంగూర‌ను నీటిలో శుభ్రం చేసుకుని ఆర‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక‌.. ముందుగా ఆర‌బెట్టుకున్న గోంగూరను వేసి.. మెత్త‌గా ఉడికించాలి. ఆ త‌ర్వాత ఉడికించిన గోంగూర‌ను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి, 

 

ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి పోసి వేడెక్కాక దాల్చిన చెక్క, బిర్యాని ఆకు, జీడిపప్పు, లవంగాలు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్క‌లు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. 

 

అనంత‌రం గోంగూర పేస్ట్ వేసి బాగా కలపాలి. చివరగా బాస్మతి బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. మూడు విజుల్స్‌ వచ్చాక దించితే సరిపోతుంది. అంతే నోరూరించే గోంగూర బిర్యానీ రెడీ అయిన‌ట్లే. వేడివేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ గోంగూర బిర్యానీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

 

ఇక గోంగూర ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్న గోంగూర చాలా పవర్ ఫుల్. అందుకే దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: