కావాల్సిన ప‌దార్థాలు:
పన్నీర్ ముక్క‌లు- ఒక‌టిన్న‌ర క‌ప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూన్‌
ఉల్లిపాయ ముక్క‌లు- ఒక క‌ప్పు

 

పచ్చిమిర్చి- రెండు
కోడి గుడ్డు- ఒకటి
కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు
సోయాసాస్- ఒక టీస్పూన్‌

 

వెనిగర్- రెండు టీస్పూన్లు
నూనె- సరిపడినంత
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కొత్తిమీర- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: 
ముందుగా పన్నీర్‌ను మీకు ఇష్ట‌మైన సైజులో ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు వేసి, అందులో కోడిగుడ్డు సొన, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. ఓ అరగంట పాటూ అలా వదిలేయాలి. అనంతరం స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.. నూనె వేయాలి. 

IHG

నూనె వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ రంగులోకి వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల‌ నూనె వేసి అది వేడెక్కాక ఉల్లి తురుము, పచ్చి మిర్చి తురుము వేసి వేయించాలి. 

IHG

ఆ త‌ర్వాత అందులోనే సోయాసాస్, వెనిగర్ వేసి కలపాలి. ఐదు నిమిషాల త‌ర్వాత అందులో ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల త‌ర్వాత కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. 

IHG

అంతే నోరూరించే చిల్లీ పన్నీర్ రెడీ. రోటీ లేదా రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ చిల్లీ పన్నీర్ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: