కావాల్సిన ప‌దార్థాలు:
క్యారెట్లు - నాలుగు
బ్రెడ్ స్లైసులు - ప‌ది
మిరియాల పొడి - పావు టీ స్పూన్‌

 

వెన్న - ఒక టీస్పూన్‌
కారం - అర స్పూన్‌
పనీరు తురుము - పావు కప్పు

 

ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిర్చి - మూడు
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి త‌గినంత‌

 

త‌యారీ విధానం:
ముందుగా క్లారెట్ల‌ను నీటిలో శుభ్రం చేసి.. తురుముకోవాలి. మ‌రియు ఉల్లిపాయల‌ని చిన్నముక్కలుగా కోసుకోవాలి, పచ్చిమిర్చిన నిలువుగా క‌ట్ చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి కాస్త వెన్న వేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. 

 

అనంతరం పన్నీర్ తురుమును కూడా వేసి వేయించాలి. ఈ మిశ్రమం బాగా వేగాక అందులో ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటూ వేయించి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు కత్తిరించాలి. వాటిలో మధ్యలో వేయించిన మిశ్రమాన్ని ఓ రెండు స్పూనులు వేసి రోల్ లా చుట్టేయాలి. రోల్ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. 

 

అన్ని బ్రెడ్ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకోవాలి. అనంత‌రం స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి. నూనె వేడెక్కాక బ్రెడ్ రోల్స్ ని నూనెలో వేసి గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి తీయాలి. అంతే ఎంతో సులువుగా వేడి వేడి క్యారెట్‌ బ్రెడ్‌ రోల్స్ రెడీ. సాయంత్రం వేళ వీటిని వేడి వేడిగా తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ క్యారెట్‌ బ్రెడ్‌ రోల్స్ త‌ప్ప‌కుండా త‌యారు చేసుకుని.. ఎంజాయ్ చేయండి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: