కావాల్సిన పదార్థాలు: 
రొయ్యలు - పావు కిలో
ఉప్పు - 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి - 10
వినెగర్‌ - పావు కప్పు


కారం - 4 టీస్పూన్లు 
పసుపు - 1 టీస్పూను 
అల్లం - 60 గ్రాములు
వెల్లుల్లి -60 గ్రాములు 
నువ్వుల నూనె - 1 కప్పు


మసాలా పొడి కోసం:
ఉప్పు - ఒకటిన్నర టీస్పూను 
గరం మసాలా - 1 టీస్పూను 
కారం - 1 టేబుల్‌స్పూను
మిరియాల పొడి - 2 టీస్పూన్లు
పసుపు - 2 టీస్పూన్లు (వీటన్నిటినీ కలిపి పెట్టుకోవాలి).


తయారీ విధానం: 
ముందుగా రొయ్యల్లో 2 టీస్పూన్ల ఉప్పు, పసుపు వేసి అరగంట నానబెట్టాలి. తర్వాత రొయ్యల్లో ఊరిన నీటిని వంపేయాలి. బాండీలో అర కప్పు నూనె వేసి కాగాక రొయ్యలు, కారం వేసి బాగా కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు వేగించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత బాండీలో నుంచి తీసి వేరే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. 


అల్లం, వెల్లుల్లి కలిపి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. అదే బాండీలో మిగతా నూనె పోసి అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి చిన్న మంట మీద పచ్చి వాసన పోయేవరకూ వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, మసాలా పొడి, ఉప్పు కూడా వేసి ఓ నిమిషంపాటు వేగించాలి.


వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి, పావు కప్పు వెనిగర్‌ పోసి కలపాలి. చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. పచ్చడి పొడిగా తయారై నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. పూర్తిగా చల్లారాక పొడిగా ఉన్న జాడీలో నింపుకోవాలి. అంతే రొయ్య‌ల ప‌చ్చ‌డి రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: