కావాల్సిన పదార్థాలు
కాలీఫ్లవర్‌ - 1
శనగపిండి - 1 కప్పు
కారం - 2 టీ స్పూనులు
ఉప్పు - తగినంత
జీలకర్ర పొడి- 1 టీ స్పూను


ఇంగువ పొడి - పావు టీ స్పూను
నూనె - తగినంత
బియ్యపు పిండి- 3/4 కప్పు
మొక్కజొన్న పిండి - 3/4 కప్పు
పసుపు - పావు టీ స్పూను


తయారీ విధానం:
ముందుగా కాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడిగి ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. తర్వాత స్టౌపై బాణలి పెట్టి అందులో ఉప్పు కలిపిన నీరు పోసి కాలీఫ్లవర్‌ ముక్కలను ఉడకబెట్టాలి. ఉప్పు కలిపిన నీరు వల్ల ఫ్లవర్‌లో పురుగులుంటే బయటకు వస్తాయి. తర్వాత బాణలిలో నీరు ఇంకేంత వరకు ఉంచి స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత కాలీఫ్లవర్‌ ముక్కలను శనగపిండి, బియ్యపుపిండి, మొక్కజొన్న పిండిలో కలపాలి.


అలాగే కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి వేసి బాగా క‌లుపుకోవాలి. త‌ర్వాత‌ బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలను అందులో వేయాలి. గోల్డ్ క‌ల‌ర్‌ వచ్చే వరకు వేయించాలి. వేగిన ముక్కలను టిష్యు పేపర్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే స్పైసీ స్పైసీ కాలీఫ్లవర్‌ పకోడి రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: