కావాల్సిన పదార్థాలు
అన్నం- 2 కప్పులు
ఉడికించిన స్వీట్‌ కార్న్‌ గింజలు- పావు కప్పు
క్యారెట్‌ ముక్కలు- పావు కప్పు
కొబ్బరి తురుము- 3 టేబుల్‌ స్పూన్లు


నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి- 1 టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి పేస్ట్- 1 టేబుల్‌ స్పూన్‌
మిరియాల పొడి - అర‌ టేబుల్‌ స్పూన్‌


నిమ్మరసం- అర‌ టేబుల్‌ స్పూన్‌
కొత్తి మీర తరుగు- కొద్డిగా
ఉప్పు- స‌రిప‌డా
వెల్లుల్లి రెబ్బలు- 4


తయారుచేసే విధానం:
ముందుగా బాణలీలో నూనె వేసి వేడి అయ్యాక‌ పచ్చిమిర్చి పేస్ట్‌ను వేయించి క్యారెట్‌ ముక్కలు కూడా వేయాలి. క్యారెట్ ముక్కులు వేగాక ఇందులో ఉడికించిన స్వీట్‌ కార్న్‌ గింజలు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి అన్నం కలపాలి.


ఆ తరవాత మిరియాలపొడి తగినంత ఉప్పు కలిపి కొంత స‌మ‌యం మ‌గ్గ‌నివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మిరియాలపొడి తగినంత ఉప్పు కలిపి కొద్దిసేపు స్లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఆ త‌ర్వాత దింపేసే ముందు నిమ్మరసం కొత్తిమీర తరుగు చేర్చి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే `కోకోనట్‌ కార్న్‌ రైస్ రెడీ..!



మరింత సమాచారం తెలుసుకోండి: