కావాల్సిన పదార్థాలు:
చేప ముక్కలు - రెండు కిలోలు
కారం - కిలో
అల్లం తురుము - పావుకప్పు


వెల్లుల్లి తురుము - పావుకప్పు
నల్ల మిరియాల పొడి - నాలుగు టీస్పూన్లు
వెనిగర్‌ - ఐదు స్పూన్లు


పసుపు - రెండు స్పూన్లు
ఉప్పు - అరకిలో
నూనె - తగినంత


తయారీ విధానం:
ముందుగా చేప ముక్కలకు పసుపు, మిరియాలపొడి, ఉప్పు కలిపి అరగంటపాటు ఉంచాలి. తర్వాత ఈ ముక్కల్ని నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. వీటిని చేప ముక్కల్లో వేసి కలపాలి.


ఆ త‌ర్వాత కారం, వెనిగర్‌ కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత బిగించాలి. ఒకట్రెండు రోజులు ఊరనిస్తేసిరిపోతుంది. అంతే చేప‌ల పచ్చడి రెడీ. కావాలంటే ముల్లు తీసేసి, మెత్తని భాగాన్ని ముక్కలుగా చేసుకుని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. రెండు, మూడు రోజుల త‌ర్వాత ఇలా ఊర‌నిచ్చిన ప‌చ్చ‌డి తీసుకుని స‌ర్వ్ చేస్తే స‌రిపోతుంది. అలాగే రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: