ఏపీలో ఏం జ‌రిగినా.. ఇంతింత‌లు చేసి ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం.. మ‌రో సారి హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ పై చేస్తున్న దుష్ప్ర‌చారం మ‌రింత ప‌దునెక్కింది. దీంతో ఇ ప్పుడు టీడీపీ సోష‌ల్ మీడియాల్లో జ‌రుగుతున్న తాజా ప్ర‌చారంపై వైసీపీ నేత‌లు చెవిలో చిన్న‌మాట అం టూ.. `ఏంటి భ‌య్యా.. ఈ ప్ర‌చారం` అని గుస‌గుస‌లాడుతున్నారు. నిజానికి వైసీపీపై టీడీపీ ఆది నుంచి కూడా తీవ్ర దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అనుకూల మీడియా అండ‌తో విష ప్ర‌చారానికి పావులు క‌దుపుతున్న విష‌యం తెలిసిందే. ఏం చేసినా.. దానికి విమ‌ర్శ‌ల కంత‌లు వెత‌క‌డం టీడీపీ నేత‌ల‌కు ప‌రిపాటిగా మారిం ది. 


రాష్ట్రంలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు.. ఆయ‌న అప్ప‌టి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని అత్యంత త‌క్కువ ఖ‌ర్చుతో దీనిని పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఈ విష‌యంపై ఆయ‌న ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు. ఆ త‌ర్వాత కూడా త‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో ఖ‌ర్చును దాదాపుగా స‌గానికి త‌గ్గించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాదిరిగా .. జ‌గ‌న్ స‌ర్కారు జ‌న సంప‌ద‌ను ఎక్క‌డా వృధా చేయ‌డం లేద‌న్న‌ది జ‌గమెరిగిన స‌త్య‌మే. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏదో ఒక రూపంలో విష ప్ర‌చారం చేస్తున్న వైనం విశ్లేష‌కుల‌కు సైతం అంతుచిక్క‌డం లేదు. 


చిరుతిళ్ల ఖ‌ర్చు రెండు కోట్ల రూపాయలా? అంటూ.. జ‌గ‌న్‌పై చేస్తున్న విమ‌ర్శ బాగానే వైర‌ల్ అవుతోంది. 2014లో చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేసిన‌ప్పుడు కోటిన్న‌ర ఖ‌ర్చు చేశారు. అయితే, రాష్ట్ర ఆర్థిక స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ స్వీకార ఖ‌ర్చును కేవ‌లం 30 శాతానికి ప‌రిమితం చేశారు. నిజాని కి అలాగే జ‌రిగింది. పార్టీ శ్రేణులు ఎవ‌రూ విజ‌య‌వాడ కు రావ‌ద్ద‌ని పిలుపునిచ్చారు. ప్ర‌ధాన న‌గ‌రాల్లో.. స్క్రీన్లు పెట్టి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు. అదేస‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారికి మే నెల నేప‌థ్యంలో ఎండ తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని మ‌చ్చిగ‌, వాట‌ర్ ప్యాకెట్లు పంచారు. 


దీనికి సంబంధించి అయిన ఖ‌ర్చు కేవ‌లం 30 ల‌క్ష‌ల లోపేన‌న్న‌ది ప్ర‌భుత్వం మాట‌. అయితే, ఇప్పుడు చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌లు.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎప్ప‌టివో లెక్క‌లు కూడా క‌లిపేసి.. వాటిని కూడా జత చేసి.. మొత్తాన్ని ఒకే ఖాతాలో  గుప్పించి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్న వైనం.. విస్మ‌యానికి గురి చేస్తోంది. తాజాగా ఈ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప‌ద్దుల‌ను చూస్తే.. ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం.. జ‌రిగిన అధికారుల గెట్ టుగెద‌ర్ స‌హా.. జ‌న‌వ‌రి 26 కార్య‌క్ర‌మానికి జ‌రిగిన ఖ‌ర్చు కూడా క‌లిపే ఉంది. దీంతో అస‌లు విష‌యం తెలిసిన విశ్లేష‌కులు న‌వ్విపోతున్నారు. ఇదే విష‌యంపై వైసీపీ నాయ‌కులు చెవిలో చిన్న‌గా గుస‌గుస‌లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: