రాజ‌కీయాల‌ను న‌మ్ముకున్న‌వారు ఏదో ఒక రోజు.. అనుకున్న‌ది సాధిస్తారు.. ఉద్య‌మాల‌ను న‌మ్ముకున్న ‌వారు.. ఇదిగో ఇప్పుడు ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం మాదిరిగా త‌ల‌ప‌ట్టుకోవాల్సిందే! -ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ఇప్పుడు ఇదే వార్త ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తు తం గాంధీగారి రోజులు లేవు. ఇక‌, రావు. కాబ‌ట్టి.. ఆయ‌న‌లా స‌త్యాగ్ర‌హాలు, మౌన వ్ర‌తాలు చేస్తామంటే.. ఎవ‌రు మాత్రం వింటారు? ఎవ‌రు మాత్రం ప‌ట్టించుకుంటారు?  ఉన్న‌దంతా బ్లాక్‌మెయిల్ వ్య‌వ‌హార‌మే! మా వ‌ర్గం ఇది.. మా ద‌గ్గ‌ర ఇన్ని ఓట్లున్నాయ్‌.. ఇన్ని సీట్లున్నాయ్‌.. సో.. మా ప‌రిస్థితేంటి? ఇదీ నేటి రాజకీయం. 


ఈ సూత్రం తెలియ‌నివారు ఎవ‌రుంటారు?  కానీ, ఎందుకో.. కాపుల కోసం.. మా జాతి.. మాజాతి అంటూ.. రోడ్డెక్కిన కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మాత్రం అహిసా యుత సిద్ధాంతానే న‌మ్ముకున్నారు. 2014లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌మ‌ని ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ఒ క‌టా రెండా? అనేక రూపాల్లో ఆయ‌న కాపు జాతికోసం ఉద్య‌మించారు. కుటుంబం మొత్తాన్ని కూడా రంగం లోకి దింపారు. ఎక్క‌డా ఆయ‌న దిగ‌జార‌లేదు. ఎక్క‌డా ఆయ‌న మితిమీరి ఏమీ చేయ‌లేదు. అంతా అహింసా యుతంగానే ఉద్య‌మాన్ని న‌డిపించారు. అయితే, కొన్ని శ‌క్తులు సృష్టించిన తుని రైలు దుర్ఘ‌ట‌న త‌ప్ప కాపు ఉద్య‌మం న‌డిపించ‌డంలో ముద్ర‌గ‌డ విజ‌యం సాధించారు. 


ఇక‌, ఇప్పుడు ఆయ‌న ఈ ఉద్య‌మం నుంచి త‌ప్పుకొంటున్నాన‌ని, సెల‌వు ప్ర‌క‌టిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశా రు. దీంతో ఇక‌, ఈ ఉద్య‌మం ప‌రిస్థితి ఏంటి?  ముందుకు సాగుతుందా?  లేదా? అంటే.. అంద‌రూ ముద్ర ‌గ‌డ వంటి నాయ‌కులే అయి ఉంటే.. అస‌లు ఉద్య‌మం ఏనాడో స‌ఫ‌లీకృతం అయ్యేది. ఏనాడో కాపుల‌కు జ‌ర‌గాల్సిన మంచి ఏమిటో జ‌రిగిపోయి ఉండేది. కానీ, నేటి ప‌రిస్థితి అలా లేదు. ఇక, కాపుల ఉద్య‌మం అట‌కెక్కిన‌ట్టే. ఈ ఉద్య‌మానికి ఇక, నీరు, నిప్పు పూర్తిగా అడుగంటిన‌ట్టే. మ‌రి ఇక‌, ముద్ర‌గ‌డ ప‌రిస్థితి ఏంటి? ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారాన్ని బ‌ట్టి.. ఆయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 


ఎందుకంటే.. త‌న‌మన‌సులో కాపుల‌కు ఏదైనా చేయాల‌ని ఆయ‌న త‌పిస్తున్న మాట వాస్త‌వ‌మే. అయితే, ఇ ప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఉద్య‌మం చేసినా. దీనిని సాధించుకోలేక పోయారు. ఏ రాజ‌కీయ పార్టీనీ ఆయ‌న మె డ‌లు వంచ‌లేక పోయారు.ఈ  క్ర‌మంలో చ‌ట్ట‌స‌భ‌ల ద్వారా అయినా.. ఆయ‌న కాపు జాతికి మేలు చేయాల ‌ని భావిస్తున్నార‌ని స‌మాచారం. పైకి చెప్ప‌క‌పోయినా.. ఆయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ ప‌రిణామాలు ఎటు మ‌లుపుతిరుగుతాయో చూడాలి. ఏదేమైనా.. ముద్ర‌గ‌డ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారిందన‌డంలో సందేహం లేదు. ఉద్య‌మం ఓడినా.. ఆయ‌న మాత్రం నూటికి నూరు మార్కుల‌తో విజ‌యం సాధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: