రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపై హత్య చేసి దహనం చేయడం చూస్తుంటే సభ్యసమజం  నివ్వెర పోతున్న దుస్థితి   నెలకొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ప్రియాంక రెడ్డి అనే వెటర్నరీ  డాక్టర్ ను పాశవికంగా అమానవీయం గా  మానవమృగాలు నలుగురు యువకులు క్రూరంగా హత్య చేసి  దహనం చేయడం   అదే సమీపంలో మరో యువతి కాలిన శవం లభ్యం కావడం వరంగల్ లో మానస అనే యువతి ని  కూడా అత్యాచారం చేసి హత్యచేయడం దుర్మార్గమైన చర్యగా పలువురు  ఖండిస్తున్నారు. అఘాయిత్యాల నియంత్రణకు కళ్లెం లేదా?  

మహిళలను అత్యాచారం చేసి హత్య చేసి దహనం  చేయడం చూస్తుంటే రోజురోజుకు కామాంధుల అఘాయిత్యాలు శ్రుతిమించుతూనే ఉన్నాయి.   7  దశాబ్దాల స్వతంత్ర భారతా వనిలో  ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం యావత్  దేశం నిర్గాంతపోయింది .  సంఘటన జరిగిన సమయంలో కొన్ని రోజులు  మీడియా మహిళా విద్యార్థి సంఘాలు వంటి వారు  హడావుడి చేయడం తర్వాత షరా మామూలే కావడం  ఇలాంటి సంఘటనలు  మరలా పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇది సభ్యసమాజానికి మింగుడుపడని విషయం. గతంలో స్వప్నిక ప్రణీత లపై యాసిడ్ దాడి వరంగల్ లో  జరిగినప్పుడు  పోలీసులు ఎన్  కౌంటర్  చేసినట్లుగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అదే తరహాలో కామాంధులను కాల్చివేయాలని మహిళా లోకం గర్జించడం వారిలో చైతన్యం పెల్లు బీకుతున్నట్లు ,  సభ్యసమాజం ప్రజాగ్రహం లో  కూడా  కట్టలు తెంచుకున్నట్లు  మనకు అవగతమవుతుంది . ఇటీవలి కాలంలో  హన్మకొండలో మాతృ మూర్తి ఒడిలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల  అభం శుభం తెలియని పసి పాప పై   కొలిపాక ప్రవీణ్ అనే కామ పిశాషి  అత్యాచారం చేయడం ఆ తర్వాత  పసి పాప ప్రాణాలు కోల్పోవడం క్షమించ రాని నేరంగా భావించవచ్ఛు ఆ ప్రభుద్దునికి హై కోర్టు జీవిత కాల శిక్షను విధించింది.  ఇటీవలి కాలంలో  చిన్న పెద్ద అనే తేడా లేకుండా మానవ క్రూర మృగాల వలే విరుచకపడి మహిళల మానాన్ని దోచుకోవడం పశుప్రవృత్తికి అద్దం పడుతోంది 
 
  2012 లో ఢిల్లీ లో మెడికల్ కాలేజీ ని విద్యార్థిని హత్యాచారం చేసి బస్ లో నుండి తోసేయడం తో తీవ్రంగా గాయాలైన ఆ బాలికను మన దేశంలో సింగపూర్ లో వైద్య సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు అప్పుడు కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.ఆ సంఘటన విషయంలో లోనే నిర్భయ చట్టం అమలులో కి వచ్ఛింది.కఠినమైన చట్టాలు రూపొందించినా కానీ దేశంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం గా చెప్పవచ్చు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులకు చట్టాలు ఉన్నట్లు తెలియదా , శిక్ష లు ఉన్నట్లు తెలియదా సమాజం తమను చిన్న చూపు చూస్తుందనే విషయం తెలియాదా అంటే తెలుసు అనే విషయం సుస్పష్టం. కానీ ఈ  అఘాయిత్యాలకు ఒడిగడుతున్న కామాంధులకు  ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఉన్నత న్యాయ స్థానాల ద్వారా  స్వల్ప కాలంలో ఉరిశిక్షలు అమలు అయ్యేలా  చట్టాల్లో సమూలమైన మార్పులు చేసి కఠినమైన చట్టాలను రూపొందిస్తేనే  విజృంభిస్తున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఆధునిక కాలంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పెరిగిన  ఈ కాలంలో  హింసాప్రవృత్తి  లైంగిక  పశు ప్రవృత్తి యువకుల్లో పెరగటం చూస్తుంటే స్మార్ట్  ఫోన్ లలో  అంతర్జాలం ద్వారా లైంగిక ఛాయచిత్రాలు ప్రత్యక్షంగా చూడటం  , సినిమాలు సీరియల్స్ ప్రభావం వలన కూడా  యువకులు  ఇలాంటి దారుణమైన  సంఘటనలకు ఒడిగడుతున్న  దుస్థితి.  ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాలంలో లైంగిక పరిజ్ఞానం పేరుతో కనిపిస్తున్న సైట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు , సెన్సార్ బోర్డు  నిలిపివేయాలి.  అదేవిధంగా మద్యాన్ని  కూడా నిషేధిస్తే  సమాజం లో  నేరాలు హత్యలు అత్యాచార సంఘటనలు పూర్తి స్థాయిలో  తగ్గు ముఖం పట్టవచ్చు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇదే విషయాన్ని పలువురు మేధావులు, విద్యార్థులు,  మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నారు 

  భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మొదటగా  తల్లిదండ్రులు  ఆ తర్వాత విద్యాసంస్థల లో నైతిక విలువలు చట్టాలపై , శిక్షలపై అవగాహన పెంపొందిస్తే  కొంత మేరకు నేరాలు అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అదేవిధంగా  ప్రతి జిల్లా కు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేసి టీవీలలో   ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మహిళల రక్షణ కొరకు షీ టీమ్ , 100 కాల్స్  వంటి వాటిపై   అవగాహన ను కల్పిస్తే మహిళలు   నష్టపోకుండా ఉండటానికి మార్గం సుగమం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: