న్నో కష్టాలు... ఎన్నో నష్టాలు.. మరెన్నో వెన్నుపోట్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో అవరోధాలను ధైర్యంగా ఎదుర్కుంటూ ముఖం మీద చిరునవ్వుని చెరగనీయకుండా .. ఓదార్పు యాత్ర... పాదయాత్ర పేరు ఏదైనా తొమ్మిదేళ్ల పాటు ప్రజల్లోనే ఉంటూ ... ప్రజలు పడుతున్న బాధలు అన్నిటిని స్వయంగా తెలుసుకున్నాడు. నేనున్నాను ..నేను విన్నాను అంటూ భరోసా ఇచ్చాడు. ఏదయితేనేమి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం పీఠం మీద కూర్చున్నాడు. ఇంకేముంది అంతా షరా మాములే ఎంతమంది సీఎంలను చూడలేదు...? అధికారంలోకి వచ్చే వరకు ఎన్నో చెబుతారు. అధికారం ఒక్కసారి వచ్చింది అంటే అందరూ ఒక్కటే అని ప్రజలు కూడా అనుకున్నారు.


కానీ ఇక్కడే జగన్ మార్క్ అంటే ఏంటో చూపించాడు. తాను అందరిలా మాటల సీఎం కాదు చేతల సీఎం అని జగన్ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే నిరూపించుకున్నాడు. అసాధ్యం అనుకున్న పథకాలను, నిర్ణయాలను అమలు చేసాడు. అందరూ నోరెళ్లబెట్టేలా తన పరిపాలన ఎలా ఉంటుందో చూపించాడు. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నాలుగేళ్ళ పాటు ఏదో తూతూ మంత్రంగా పరిపాలన చేసిన చివరి సంవత్సరంలో అదో ప్రజల కోసం పాటుపడిపోతున్నట్టుగా హడావుడి చేస్తూ ఉంటాయి. కానీ అందరిలా ఉంటే నేను జగన్ ఎందుకు అవుతాను అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఏ హామీలయితే ఇచ్చాడో వాటన్నిటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు.

 

ఈ తొమ్మిదేళ్ల జగన్ పాలన గురించి చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే ఈ స్థాయిలో రికార్డు సృష్టించే నాయకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అసలు జగన్ పరిపాలన ఏపీలోనే కాదు ఇప్పడు దేశమంతా చర్చకు వస్తోంది. జగన్ అమలు చేసిన పథకాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. 


అసలు జగన్ ఈ తొమ్మిది నెలల్లో ఏం చేసాడు ...? 

 

పగలనకా, రాత్రనకా కష్టపడుతున్న పోలీసులకి వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టాడు. ఇది ఇప్పుడు దేశమంతా అమలు కాబోతోంది.

 

మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని దిశా చట్టాన్ని, పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేసాడు. ఇప్పడు దీనిని మహారాష్ట్రలో అమలు చేయబోతున్నారు. 

 

అధివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ఇప్పుడు కర్ణాటక మొదలుపెట్టింది.

 

జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఇప్పుడు జార్ఖండ్ ఫాలో అవుతోంది.

 

ప్రస్తుతం ఏపీఏలో అమలవుతున్న ఇసుక పాలసీని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చూస్తున్నాయి. 

 

ఏపీలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉత్తరప్రదేశ్ లో అమలు చేశారు. 

 

గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఢిల్లీలోనూ అమలు చేసేందుకు క్రేజీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

ఇలా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను తమ తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 


అలాగే ఎప్పటి నుంచో అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న చిరుద్యోగులను కూడా జగన్ ఆదుకున్నాడు. అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకు, బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది, .హోం గార్డులు, వీవోఏ(వెలుగు యానిమేటర్లు), 108 పైలెట్‌(డ్రైవర్‌), ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌) వేతనం, 104 వాహన ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్ల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా ఎన్నో వర్గాలకు వేతనాలను పెంచి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తున్నాడు. క్షేత్ర స్థాయిలో జగన్  పాలనపై ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి కనిపిస్తుంది. జగన్ పాలన సూపరో సూపర్ అంటూ జనాల నుంచి రెస్పాన్స్
వస్తోంది. 


నాయకుల రచ్చ ఏంటి ..? 

 

చేతికి ఎముకే లేనట్టుగా ప్రజలకు ఏమి కావాలో, ప్రజలకు తాను ఏమి చేయగలనో చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్తుంటే జగన్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం అదే పనిగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పు జరిగినప్పుడు విమర్శలు చేసి, మంచి చేసినప్పుడు అభినందించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు జగన్ మంచి పేరు రాకుండా అనవసర ఆందోళనలు చేస్తూ హడావుడి చేస్తూ రాష్ట్ర పరువుని బజారున పడేస్తున్నాయి. పోనీ దీనివల్ల రాజకీయంగా వారు పొందే లభ్ది ఏమైనా ఉందా అంటే అదీ లేదు ప్రజల్లో పలుచనవ్వడం తప్ప.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: