కమ్మోరు కమ్మోరే..! బంతి చివరన ఉన్నా, ముందు వరుసలో ఉన్నా.. అసలు ఎక్కడ ఉన్నా కమ్మోరు కమ్మోరే. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేదు. ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కమ్మోరు కమ్మోరే ! తెలుగు రాష్ట్రాల్లో కమ్మోరు ప్రభావం ఎంత వైభోగంతో వెలిగిపోయిందో చెప్పనక్కర్లేదు. అన్ని రంగాల్లోనూ పై చేయి వీరిదే అన్నట్టుగా ఎదిగారు. అమరావతి నుంచి అమెరికా వరకు వీరిదే పెత్తనం అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఇక కమ్మ కులానికి ఆరాధ్య దైవంగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత వీరి హవా మరింతగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ రంగప్రవేశం చేయకముందు కమ్మ సామజిక వర్గం హవా అంతగా ఉండేది కాదు. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత ఎక్కడలేని ప్రాధాన్యత కమ్మ కులానికి దక్కింది. సామాజికపరంగానూ, రాజకీయంగానూ కమ్మ కుల డామినేషన్ పెరగడంతో ఈ సామజిక వర్గం అన్ని రంగాల్లోనూ లోతుగా పాతుకుపోయింది. ఎన్టీఆర్ తరువాత టీడీపీ అధినేతగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చంద్రబాబు చేపట్టిన తరువాత వీరి ప్రాధాన్యం అమాంతం పెరిగిపోయింది.    

 

IHG

1983 నుంచి 2020 కి మొత్తం చూసుకుంటే 37 ఏళ్లు. ఈ కాలంలో మొత్తం మీద తెలుగుదేశం అధికారంలో ఉన్న ఇరవై ఏళ్లకు పైనే. కానీ కమ్మ సామాజిక వర్గం ఏమైనా ఇబ్బందికి గురయింది అంటే అది ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ పరిపాలనలోనే. వైఎస్ రాజశేఖర రెడ్డి హవంలోనూ కమ్మ సామజిక వర్గం పెద్దగా ఇబ్బందులు పడలేదు. మొత్తం కమ్మ సామజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ జగన్ ముందుకు వెళ్తుండడంతో ఆ సామజిక వర్గం అల్లల్లాడిపోతోంది. వ్యాపారాలు, పరిశ్రమలు, కాంట్రాక్టులు ఇలా అన్నిట్లోనూ జగన్ ఈ సామజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. వాస్తవం చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కమ్మ సామజిక వర్గానికి ప్రాధాన్యత బాగానే దక్కింది.

 

లగడపాటి, నిమ్మగడ్డ ప్రసాద్, నవయుగ, పివిపి, కోనేరు ప్రసాద్ ఇలా ఎందరో కమ్మ నేతలు బాగానే లబ్ది పొందారు. అయితే వైఎస్ మరణం తరువాత కానీ, జగన్ జైలులో ఉన్న సమయంలో కానీ వీరెవరూ జగన్ ను పట్టించుకోకపోవడంతో ఆ సామజిక వర్గంపై జగన్ కక్ష పెంచుకున్నారు. ఎన్నిరకలుగా అవకాశం ఉంటే అన్నిరకాలుగానూ కమ్మ సామజిక వర్గ ప్రముఖులందరిని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ పాలనలో ఇంతగా ఇబ్బంది పడుతున్న కమ్మ నేతలకు, ఇప్పుడు కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పటికే అన్ని రకాలుగా దెబ్బ తిన్న వారికి కరోనా కారణంగా ఉన్న వ్యాపారాలు అన్ని మూసుకుపోయి ఆర్ధికంగా చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

 

IHG

అప్పట్లో ఒక వెలుగు వెలిగిన ఈ కమ్మ నేతలని చూసి అయ్యో పాపం అని జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీరేమి చేతులు కట్టుకుని కూర్చోలేదు. మీడియాలో మెజార్టీ శాతం వీరి చేతుల్లోనే ఉండడంతో జగన్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా బురద జల్లే విధంగా ఎన్నో కథనాలను ప్రచారం చేస్తున్నారు. అడుగడుగునా జగన్ హవాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు చేయాల్సింది చేత్తోనే, తమకు మళ్లీ పునర్వైభవం ఎప్పుడు వస్తుందా అని కమ్మ ప్రముఖులంతా ఎదురుచూపులు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: