ప్రపంచమంతా కరోనా వైరస్ ప్రభావంతో తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ బారిన పడడంతో, దీని నుంచి ఎలా బయట పడాలి అనే విషయంపై ఆలోచిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కారణంగా బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు కూడా ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ, స్నేహపూరితంగా మెలుగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనదుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే కేరళలో ప్రతిపక్షాలు, అధికార పార్టీ మూకుమ్మడిగా కరోనని ఎదుర్కునేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు స్వయంగా ప్రతిపక్షనేత లు, సీఎం కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా తాము కరోనని ఎదుర్కోబోతున్నామంటూ చెబుతూనే, ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఏపీలో మాత్రం దానికి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. అధికార పార్టీ ఈ పరిస్థితి నుంచి ప్రజలను బయటపడేసేందుకు తమవంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, శక్తివంచన మేరకు ప్రజలకు ఏ లోటు లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది.

 

IHG
 అదే సమయంలో ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు విధిస్తూ కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశ వ్యాప్తంగా పరిస్థితిని అదుపులోకి తెస్తున్న రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉండనే విషయాన్ని ఎన్డీటీవీ సర్వేలో తేలింది. అయితే అధికార పార్టీ చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు సహకరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఏదోరకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే తమ చర్యగా భావిస్తూ బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉచితంగా రేషన్ అందించడంతోపాటు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అందించింది. అలాగే రెండో విడత అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 

IHG

 ఇవన్నీ పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు పాల్పడుతూ... కరోనా రాజకీయాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెజవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి ఐదు వేలు ఇవ్వాలని కోరుతూ ఈ కరోనా సమయంలో 12 గంటల దీక్ష చేపట్టారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దంపతులు. ఈ దీక్షకు టీడీపీ ఎంపీ కేశినేని నాని, బుద్ధ వెంకన్న వంటి వారు మద్దతు పలికారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఈ విధంగా దీక్షకు దిగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రజల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


అసలు దేశంలో ఎక్కడా ఈ విధంగా ఇవ్వడంలేదు. తెలంగాణ విషయానికి వస్తే అక్కడ ఆర్థిక లోటు పాట్లు లేకపోయినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కానీ ఏపీలో ఆ పరిస్థితి రాకుండా జగన్ ప్రభుత్వం జీతాలు ఆపకుండా రెండు విడతలుగా జీతాలను ఇస్తామని ప్రకటించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్ తో పాటు కిలో కందిపప్పు, వెయ్యి రూపాయలు ఇప్పటికే పంపిణీ చేసింది. ఇంతగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నా,ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా ఈ విధంగా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలిసిన టిడిపి అధినేత, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈ సమయంలో రాజకీయాలు చేయడం విమర్శల పాలవుతోంది. 


ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆ పార్టీ నాయకులతో సమావేశాలు జరుపుతూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే అంశంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు ఏపీ లో ఉన్న కరోనా వైరస్ ఈ స్థాయిలో విరమించడానికి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు  వెళ్లి వచ్చిన వారే కారణం అన్న విషయం అందరికీ తెలుసు. అసలు ఏపీ అధికారులే ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి తెలియంది కాదు. ఇక్కడి అధికారులు అప్రమత్తం చేయడంతోనే దేశవ్యాప్తంగా పెను ముప్పు తప్పింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శలు తగ్గించి మౌనంగానే ఉంటున్నారు. 
కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా పక్కనపెట్టి ఈ విధంగా ఈ విపత్తు సమయంలో విమర్శలు చేయడమే కాకుండా కుయుక్తి రాజకీయాలకు పాల్పడుతూ తన ఇమేజ్ ను మరింత పలుచన చేసుకుంటున్నారు.
.

 

మరింత సమాచారం తెలుసుకోండి: