IHG

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన పేయింటింగ్‌ చిత్ర‌కారుల్లో రాజార‌వి వ‌ర్మ ప్ర‌థ‌ముడు. ఆయ‌న కుంచె నుంచి ఎన్నో వేల చిత్రాలు జీవం పోసుకున్నాయి. రామాయణ, మహాభారతములలోని ముఖ్య ఘ‌ట్టాల‌ను చిత్రాలుగా మలచి పేరు ప్ర‌ఖ్యాతాలు సంపాదించు కున్నాడు. అనేక భారతీయ సంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చు తునకలని చెప్ప‌వ‌చ్చు. ర‌వివ‌ర్మ త‌న పేయిటింగ్స్‌తో స్త్రీ అంద‌చందాల‌ను చెక్కిన శిల్పి అంటూ ఆయ‌న అభిమానులు కొనియాడుతుంటారు.  చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో  అతనికి అతనే సాటి అని చెప్పాలి. 

IHG

హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలా దుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. చిత్ర‌క‌ళ‌లో ఆయ‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఎన్నో ప్ర‌పంచ వేదిక‌ల‌పై భార‌తీయ చిత్ర క‌ళా ప్ర‌తిభ‌ను ఆయ‌న చాటారు.  1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని సాధించారు. అప్ప‌టి నుంచే ఆయ‌న‌లోని చిత్ర‌క‌ళ ప్ర‌తిభ‌ను ప్ర‌పంచం గుర్తించ‌డం మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుత కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురానికి స‌మీపంలోని కిలమానూరు రాజప్రాసాదంలో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. 

IHG

చిన్నతనములోనే ఇత‌ని ప్ర‌తిభ‌ను గుర్తించిన  ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్   ప్రోత్సహించ‌డం మొద‌లుపెట్టాడు. ఈక్ర‌మంలోనే  తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.  రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు. 

IHG


పల్లె పడుచు, అలోచనలో మునిగిపోయిన స్త్రీ, దమయంతి హంస సంవాదము, వాద్యకారుల బృందము, సుభద్రార్జునులు, లేడీ విత్ ఫ్రూట్స్, హార్ట్ బ్రోకెన్, స్వర్బత్ ప్లేయర్, శకుంతల, శ్రీ కృష్ణ రాయబారము, రావణ జటాయు వధ, ఇంద్రజీత్ విజయముబిక్షకుల కుటుంబము, లేడీ ప్లేయింగ్ స్వర్బత్, గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ, వరుణుని జయించిన రాముడు, నాయర్ల స్త్రీశృంగారంలో మునిగిన జంట, కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది, శంతనుడు మత్స్యగంధి, ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల, కణ్వుని ఆశ్రమములోని బాలిక. (ఋషి కన్య). వంటి చిత్రాలు ఆయ‌న‌కు ఎంత‌గానో కీర్తిని తెచ్చిపెట్టాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: