చివరకు మద్యం షాపులే కొంపముంచేసేట్లున్నాయి. కరోనా వైరస్ కారణంగా దేశమంతా గడచిన 50 రోజులుగా లాక్ డౌన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్లో భాగంగా ఇతర రంగాలు మూలపడినట్లే మద్యం వ్యాపారాలు కూడా మూతపడిపోయాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు కూడా తెరుచుకోలేదు. అలాంటిది వైరస్ తగ్గుతున్న ప్రాంతాల్లో పాక్షికంగా మద్యం షాపులను తెరుచుకోవచ్చంటూ  కేంద్ర ఆదేశిలిచ్చింది. దాంతో సోమవారం నుండి మద్యం షాపులు తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వాలు  అనుమతించాయి.

 

ఇంకేముంది జనాలు ఒక్కసారిగా కొత్త సినిమా టిక్కెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూ కట్టినట్లు మద్యం షాపుల ముందు క్యూకట్టేశారు. ఉదయం నుండి ఏ రాష్ట్రంలో చూసినా ఏ ఊరిలో చూసినా మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఈ విషయం ప్రభుత్వాలు ముందుగా ఊహించిందే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 50 రోజులుగా మందుబాబులకు మద్యం దొరకలేదన్నది వాస్తవం. మందుకోసం చాలామంది అల్లాడిపోతున్నారు. దేశంలో లాక్ డౌన్ మీద లాక్ డౌన్ కంటిన్యు చేస్తుండటంతో జనాల్లో మందు కోసం డిమాండ్లు పెరిగిపోయాయి.

 

దాంతో కేంద్రం కూడా  ఈ విషయమై ఆలోచించి పాక్షికంగా మద్యం షాపులు తెరుచుకుపోవచ్చని అనుమతించింది. దాంతో మద్యంషాపుల మీద జనాలు ఎగబడటంతో చాలా చోట్ల తోపులాటలు జరిగాయి. చాలా కొద్ది చోట్ల మాత్రమే జనాలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించారు. అసలే ఇది కరోనా వైరస్ కాలం. నిజానికి దేశమంతా లాక్ డౌన్లోనే ఉన్నా కేసుల తీవ్రత అయితే పెరుగుతునే ఉంది. ఇటువంటి సమయంలో మద్యం షాపులను పాక్షికంగా తెరవటమంటే మాటలు కాదు.

 

మద్యం కోసం షాపులకు వచ్చే వాళ్ళల్లో ఎవరికి  వైరస్ ఎంతమందికి ఉందో ఎవరికీ తెలీదు. ఎవరికైనా  వైరస్ తో  మద్యంషాపులకు వచ్చే వాళ్ళలో ఎంతమందికి వైరస్  సోకుతుందో ఎవరూ  చెప్పలేరు.  ఈ భయంతో  జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.  ఇదే నిజమైతే  వైరస్ స్ప్రెడ్ ఆపటం ఎవరి తరం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభంలో ఇది ఒకవైపు కోణం మాత్రమే. ఇంకోవైపు ఏమిటంటే  లాక్ డౌన్ కారణంగా  అన్నీ రంగాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఆదాయాలు పడిపోయాయి.

 

ఇందులో భాగంగానే  ఎక్సైజ్ ఆదాయం కూడా పడిపోయింది.  ప్రభుత్వాలకు ఆదాయాలను సమకూర్చే శాఖల్లో ఎక్సైజ్ శాఖ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ఒకవైపు కరోనా వైరస్ కారణంగా పేదలకు డబ్బులు పంపిణి చేయాలి, మరోవైపు ఉచిత రేషన్ అందించాలి, అదే సమయంలో ఆదాయాలు పడిపోయిన కారణంగా అప్పులు చేయాలి. ఈ పరిస్ధితుల్లో కేంద్రం లాక్ డౌన్ సడలింపుల్లో మద్యం షాపులకు అనుమతులిచ్చింది. దాంతో అన్నీ రాష్ట్రాలు షాపులు తెరిచాయి. దాంతో జనాలు ఎగబడుతున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: