క‌న్న‌వారిని, క‌ట్టుకున్న ఆలిని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పిల్ల‌ల‌ను  వ‌దిలేసి పొట్ట‌చేత ప‌ట్టుకుని తెలుగు రాష్ట్రాల‌కు వ‌చ్చిన ల‌క్ష‌లాదిమంది ఉత్త‌రాది వ‌ల‌స కూలీలు లాక్‌డౌన్ వేళ దుర్బ‌ర బ‌త‌కులీడుస్తున్నారు. లాక్‌డౌన్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డేట్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో సొంత గ్రామాల‌కు వెళ్లిపోతున్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భ‌రోసా ఇస్తున్నా వారిలో భ‌య‌మే ఎక్కువ‌గా గూడు క‌ట్టుకుని ఉంది. కుటుంబీకుల‌కు నెల‌ల పాటు దూరంగా ఉండాల్సి రావ‌డంతో క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కుటుంబాల‌తో స‌హా ఇన్నాళ్లు  హైద‌రాబాద్ దాని చుట్టు ప‌క్క‌ల ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి పొందుతున్న ల‌క్ష‌లాదిమంది వెళ్లిపోతుండ‌టంతో పారిశ్రామిక వ‌ర్గాల్లోనూ ఆందోళ‌న నెల‌కొంటోంది.


లాక్‌డౌన్ ప‌రిశ్ర‌మ‌ల్లో కూలీలుగా, కార్మికులుగా ప‌నిచేస్తున్న వారిపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపింది. అంతేకాక క‌ష్ట‌స‌మ‌యంలో కుటుంబాల‌కు ద‌గ్గ‌ర‌గా లేమ‌నే బాధ వారిని వెంటాడుతోంది. బ‌తికుంటే..అంతా స‌ర్దుకుని వ‌స్తావ‌మ‌ని కొంత‌మంది...పుట్టిన గ‌డ్డ‌మీదే క‌లో గంజో తాగి నా అన్న‌వాళ్ల మ‌ధ్య‌నే బ‌తుకుతామంటూ అనేక మంది వ‌ల‌స కూలీలు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఇక్కడ పనులు చేస్తూ.. సంపాదనలో ఎంతో కొంత ఇంటికి పంపుతున్నవారికి కరోనా కాటుకు పనులు కరవయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక విలవిల్లాడారు. వాస్త‌వానికి  సొంత రాష్ట్రంలో రూ.200 కూలీ వస్తే ఇక్కడ రూ.500 దొరుకుతున్నాయి. అందుకే ఇక్క‌డ‌కు మేం రావ‌డానికి ఇన్నాళ్లు ఇష్ట‌ప‌డ్డాం..కాని ఎప్పుడంటే అప్పుడు స్వరాష్ట్రానికి వెళ్లే వీలులేనప్పుడు ఇక్కడ ఉండలేం అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. 


పైగా హైద‌రాబాద్ దాని చుట్టుప‌క్క‌ల జిల్లాల్లోనే వ‌ల‌స కూలీలు ఎక్కువ‌గా ఆవాసం ఉంటున్నారు. అయితే ఐదు జిల్లాలు కూడా రెడ్‌జోన్‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్ర ప్ర‌భుత్వం  ప‌నుల‌కు ష‌ర‌తుల‌తో కూడిన ఆనుమ‌తులిచ్చిన‌ప్ప‌టికి ఇబ్బందులే ఉంటాయ‌న్న‌ది కూలీల వాద‌న‌. వాస్త‌వానికి అందులో నిజం ఉంది. ఇక కొంత‌మందైతే లాక్‌డౌన్‌కు ముందు రెండు నెల‌లుగా ఇంటికి డ‌బ్బు పంపించ‌డం మిన‌హా వెళ్ల‌లేక‌పోయామ‌ని, మ‌రికొంత‌మంది అయితే ఆరునెల‌లుగా ఇంటి మొహం చూడ‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌,గచ్చిబౌలి, హైటెక్స్‌,  రాయదుర్గం, నానక్‌రాంగూడ, నాచారం ప్రాంతాల్లో నివసిస్తున్న వీరు తిరుగుప్రయాణానికి అనుమతికి పెద్ద‌సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: