కొంతమంది గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చుంటారు. తమ ప్రత్యర్థికి సంబంధించి ఏదైనా చిన్న విషయం తెలిసినా.. గోరంతను కొండంత చేసి రాద్ధాంతం చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అటువంటి వారిని ఉద్దేశించే సేవల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెతతో సంబోధిస్తుంటారు. ఏపీలోనూ అటువంటి దిక్కుమాలిన రాజకీయ కుట్ర కోణాలు, సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తూ, బోడిగుండుకు మోకాలికి ముడేట్టేసే వాళ్ల సంఖ్యకు కొదవే లేకుండా పోయింది. ఇప్పుడు విషయంలోకి వద్దాం..! ఒకవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో అల్లాడుతోంది.ఆ ప్రభావం ఏపీలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలోనూ మేము మారంగాక మారం అన్నట్టుగా నాయకుల వ్యవహారశైలి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులూ, ఆ పార్టీ మద్దతు దార్లు అసలు ఏ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. 

 

IHG

విశాఖలో ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో  ఎల్జి పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ కారణంగా ఎంతోమంది అక్కడికక్కడే మరణించగా.. వేలాదిమంది ఆసుపత్రి పాలయ్యారు ఈ సమయంలో ప్రజలకు ధైర్యం కల్పిస్తూ సహాయ కార్యక్రమాలలో పాలుపంచుకోవాల్సిన నాయకులు యధావిధిగా బురద రాజకీయాలకు తెరలేపారు. విష ప్రచారం చేస్తూ ఈ ప్రమాదంపై స్పందిస్తున్న తీరు నిజంగా రాజకీయాలపై అసహ్యాన్ని కలిగిస్తుంది. అసలు ఒకవైపు ఈ విషాద సంఘటన పూర్తిస్థాయిలో సద్దుమణిగాక ముందే నాయకులు, వివిధ పార్టీల వారు ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో, ఎవరికి తోచిన విధంగా వారు అభ్యంతరకర పోస్టింగ్స్ సోషల్ మీడియా ద్వారా విశాఖ కథనాలకు జత చేసి వ్యాప్తి చేస్తున్నారు. వాస్తవానికి సంఘటన జరిగిన విశాఖలో ఎప్పుడూ జాతీయ విపత్తు బలగాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి, అప్పటికప్పుడు వారు రంగంలోకి దిగి అనేక మందిని ఆస్పత్రిలో చేర్పించారు.

IHG


 ఇళ్లల్లో చిక్కుకుపోయి సృహతప్పి పడిపోయిన వారిని తలుపులు బద్దలు కొట్టి మరీ బయటకి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన దురదృష్టకరమే. ఎవరు ఇటువంటి సంఘటన జరగాలని కోరుకోరు. అయితే దీనిని ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనల ఫోటోలు, వీడియోలతో పోల్చి ఇప్పటి సంఘటనగా  చూపిస్తూ అనవసర భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని విశాఖపట్నం కు మార్చబోతున్న నేపథ్యంలో విశాఖపట్నం ఏమాత్రం సేఫ్ కాదని గతంలో కొన్ని నివేదికలు, నివేదికలోని అంశాలను ప్రచారంలోకి తెలుగుదేశం తీసుకు వచ్చింది అనేది వైసిపి అనుకూల వ్యక్తులు చేస్తున్న ప్రచారం. కరోనా సంఘటనతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లేకపోతే విశాఖపట్నానికి రాజధాని ఎప్పుడో తరలిపోయి ఉండేదనీ, ఇప్పుడు అకస్మాత్తుగా ఈ దుర్ఘటన జరగడం, రాజధాని మార్పిడి ఇష్టం లేని టీడీపీ అనుకూల వ్యక్తుల కుట్రగా వైసీపీశ్రేణులు సందేహాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వదులుతున్నారు. 

 

అసలు ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు ఆరా తీస్తే ఇందులో మొత్తం నలుగురు విదేశీయులు కాగా, ఆపరేషన్స్ డైరెక్టర్ గా పూర్ణచందర్రావు అనే ఒక తెలుగు వ్యక్తి ఉండగా, మిగతా నలుగురు విదేశీయులు. ఇది దక్షిణ కొరియా కంపెనీ 1961 లోనే స్థాపించినా, ఆ తర్వాత చేతులు మారి చివరకు 1997లో ఎల్జీ దీనిని కొనుగోలు చేసింది. దీనికి విశాఖపట్నం లోనే కాకుండా, వివిధ ప్రాంతాల్లోని ఇటువంటి యూనిట్లు చాలా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారని, అందుకే ఇప్పుడు విశాఖ సంఘటన జరగడంతో తాను విశాఖకు వెళ్తానని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, కేంద్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 

 


ఇక తెలుగుదేశం సోషల్ మీడియా అనుకూల వ్యక్తులు మరీ శ్రుతి మించినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. విశాఖపట్నానికి ఇలాంటివి ఇంకా ఇంకా జరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నాము అంటూ అనేక రకాల పోస్టింగ్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. అయితే ఇవి ఫేక్ పోస్టింగ్స్ నా లేక నిజంగా టీడీపీ అనుకూల వ్యక్తులు పెట్టిన పోస్టింగ్స్ నా తెలియకపోవచ్చు కానీ, ఇటువంటి తరహా వైకిరి మాత్రం మంచిది కాదు అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: