విశాఖపట్నంకు సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకు ప్రమాదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే అదే రోజు మధ్యాహ్నం జగన్ వైజాగ్ వెళ్ళాడు. ఉదయం నుండి గ్యాస్ ప్రమాధ ఘటననే హైలైట్ చేసిన ఛానళ్ళన్నీ ఒక్కసారిగా ఫోకస్ జగన్ ప్రయాణంపైన పెట్టాయి. ఎందుకంటే ఇక్కడే అసలు విషయం ఉంది. అదేమిటంటే  హెలికాప్టర్లో ఎక్కటానికి క్యాంపాఫీసు నుండి జగన్ తన కారులో బయలుదేరాడు.

 

కారు ముందు సీటులో జగన్ కూర్చున్నాడు. వెనుక సీటులో ఎంపి విజయసాయిరెడ్డి కూర్చున్నాడు. తర్వాత ముందు సీటులో కూర్చున్న సీటు దగ్గరకు వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని వచ్చి మాట్లాడాడు. ఇంతలో ఏమైందో ఏమో ? వెనుక సీటులో కూర్చున్న విజయసాయి దిగిపోయి నాని ఎక్కేశాడు. వాళ్ళిద్దరూ హెలికాప్టర్లో వైజాగ్ వెళ్ళిపోయారు. ఇది వీడియోల్లోను, ఫొటోల్లోను కనిపించిన దృశ్యాలు. ఇంకేముంది వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది.

 

సీన్ కట్ చేస్తే ఇక్కడే పెద్ద అనుమానం మొదలైంది. అదేమిటంటే జగన్ వెహికల్ ఎక్కింది క్యాంపాఫీసులో. సిఎం క్యాంపాఫీసంటే ఎంత భద్రత నడుమ మధ్యలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాంపాఫీసు సమీపానికి కూడా మీడియాను భద్రతా సిబ్బంది ఎట్టి పరిస్ధితుల్లోను అనుమతించరు. అలాంటి చోట జగన్ కారులో కూర్చోవటం, విజయసాయిరెడ్డి వెనుక సీటులో కూర్చుని మళ్ళీ దిగటం, ఆళ్ళ నాని కారులో కూర్చునే దృశ్యాలు బయటకు ఎలా పొక్కింది ?

 

పైగా జగన్ వెహికల్ దగ్గర నుండి ఎవరో వీడియో తీశారు. వీడియో తీసిన వాళ్ళే ఎవరో మీడియాకు లీక్ చేశారు. మీడియాకే లీక్ చేశారో లేకపోతే తన సొంత మనుషులకు లీక్ చేస్తే అది అలా అలా సర్కులేట్ అయి మీడియా చేతికి చిక్కిందో తెలీదు.  ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియాలో వీడియో, ఫొటోలు ప్రత్యక్షమయ్యాయో వెంటనే వైరల్ అయిపోయింది.

 

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కారు వెనుక సీటులో విజయసాయి వెళ్ళాడా ? లేకపోతే నాని వెళ్ళాడా ? అన్నది కాదు. అసలు సిఎం కదలికలను అంత దగ్గర నుండి వీడియో తీసిందెవరు ? అన్న విషయమే ముఖ్యం. జగన్ ఎక్కిన కారుకు మరీ దగ్గర నుండే వీడియో తీసినట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది. అందుకే వీడియో అంత స్పష్టంగా కనబడింది. మరి జగన్ చుట్టూ అంతమంది భద్రతా సిబ్బంది ఉన్నపుడు అంత ధైర్యంగా వీడియో తీసిందెవరు ? అన్న విషయాన్ని సిబ్బంది గమనించలేదా ?

 

అంటే జగన్ చుట్టూనే లీకువీరులెవరో ఉన్నారన్న విషయం అర్ధమైపోతోంది. అదే సమయంలో విజయసాయి అంటే కూడా వాళ్ళకు పడదన్న విషయం స్పష్టమవుతోంది. కాబట్టే వీడియోను బయటకు వదిలారు. చాలామందికి విజయసాయి అంటే బాగా మంట ఉన్న మాట వాస్తవం. అందుకనే వీడియో కూడా అంతగా వైరల్ అయ్యింది. మరి తన చుట్టూనే లీకువీరులున్న విషయం జగన్ కు తెలీదా ? ఒకవేళ తెలీకపోతే ఇప్పుడన్నా జాగ్రత్త పడాలి కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: