అగ్రరాజ్యం అట్టుడికిపోతుంది, ఒకవైపు కరోనా.. మరోవైపు నిరసనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంత కాలంగా పాలనపై పట్టు కోల్పోయారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కోవడంలో ట్రంప్ ఫైలయ్యాడాని ఆ దేశ ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్ ఇంత  భాద్యతా రాహిత్యంగా ఉండటం అమెరికా ప్రజలకి రుచించడం లేదని తెలుస్తోంది. కరోనా విషయంలో ముందుగానే హెచ్చరించి ఉంటే లక్షలాది మంది అమెరికన్స్ ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని. కనీస వైద్యం అందించడంలో సైతం ట్రంప్ ఫెయిల్ అయిన మాట వాస్తవమేనని విశ్లేషకులు అంటున్నారు. అలాగే అధికారులని ఇష్టం వచ్చినట్లు విధుల నుంచీ తప్పించడం. మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకపోగా జర్నలిస్టులపై భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించడం.

 

అదేవిధంగా అమెరికా వ్యాప్తంగా భారీగా నిరుద్యోగ సమస్యలు పెరిగిపోవడం.. ఇవన్నీ ట్రంప్ చేతకానితనానికి నిదర్శనం అంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం అట్టుడుకుతున్న సమస్య జార్జ్ ఫ్లాయిడ్ హత్య అంశం. ఈ విషయంలో ట్రంప్ వైఖరి పై ప్రపంచం మొత్తం మండిపడుతోంది. ఈ విషయంపై అమెరికాలోని మెజారిటీ ప్రజలు ట్రంప్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ట్రంప్ ఒక అధ్యక్షుడిగా జార్జ్ విషయంలో కానీ నిరసనలు తెలుపుతున్న అమెరికా ప్రజల విషయంలో వ్యవహరించలేదని ప్రజలు మండిపడుతున్నారు.

 

చివరికి సొంత పార్టీ కీలక సీనియర్ నేత మాజీ అధ్యక్షుడుబుష్ సైతం ట్రంప్ పై వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు సైతం ట్రంప్ వైఖరిపై తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని తెలుస్తుంది. పైగా ఇన్ని గొడవలు జరుగుతుంటే బంకర్ లో తల దాచుకోని అసందర్భంగా మాట్లాడటం, భాద్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం ట్రంప్ పతనానికి ప్రతీకం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని పరిణామాల మధ్య మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ట్రంప్ కి ఉన్నాయా..? అంటే, ఆయన రాజకీయ భవిష్యత్తు గాలిలో కలిసిపోయిందని విశ్లేషకులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: