వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా అందరిపైనా కరోనా యుద్ధం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ మహమ్మారితో జనాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చాలా కాలంగా ఈ సమస్య ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మనదేశంలోనూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, లాక్ డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి అదుపు చేయలేనంత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. జనాల సంగతి, వారు పడుతున్న ఇబ్బందులు గురించి అయితే చెప్పనవసరం లేదు మొదట్లో ఈ మహమ్మారి విషయంలో తీవ్రంగా ఆందోళన చెందినా, ఇప్పుడు ఇదంతా కామన్ అన్నట్లుగా అందరూ  వ్యవహరిస్తున్నారు.

IHG


 సామాన్య జనాలకే కాకుండా, నిరంతరం రోగులను పరీక్షిస్తూ వారికి కరోనా చికిత్స అందిస్తూ, నిత్యం ఈ వైరస్ తో యుద్ధం చేస్తున్న వైద్యులకు, ఎండనకా వాననకా కష్టపడుతూ, కరోనా భారిన జనాలు పడకుండా రోడ్లపై ఎవరు తిరగకుండా కాపలా కాస్తున్న పోలీసులకు, ప్రజాప్రతినిధులను ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కరోనా అంటుకుంటోంది. ఇక ఈ విషయంలో మీడియా కూడా అతీతం కాదనే విషయాన్ని అనేక సందర్భాల్లో రుజువు అయ్యింది. ఇటీవల ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు కరోనా సోకడం కాస్తా కలకరిపింది. వారు చికిత్స చేయడం తో వారు సకాలంలోనే తేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. 


కొన్ని జాతీయ ఛానల్ కు సంబందించిన  వ్యక్తులకు ఈ మహమ్మారి సోకింది. ఇక ఆంధ్రప్రభలో ఐదుగురికి కరోనా రావడంతో వారితో పాటు మరో ముప్పైమందిని క్వారంటైన్ చేశారు.  అలాగే సాక్షి సెంట్రల్ ఆఫీస్ లోని రిపోర్టర్ కి కరోనా సోకడం కలకలం కలిగించింది. ఇప్పుడు తెలంగాణాలో టీవీ 5 రిపోర్టర్ ఆ వ్యాధికి గురవ్వడం,ఆ మహమ్మారి కారణంగా ఆయన ప్రాణాలు వదిలారట. దీంతో ఇప్పుడు  మీడియా ప్రతినిధులు, ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వం పని తీరును ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా పరీక్షలు నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి చూపించక పోవడం వంటి కారణాలతో ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పి ఉన్నట్లుగా కనిపిస్తోంది. 


నిత్యం కరోనా కు సంబంధించిన వార్తలు రాస్తూ ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్న మీడియా సిబ్బందికి ఇప్పుడు కరోనా సోకుతుండడంతో  ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు మీడియా లో ఉద్యోగం అంటే నే కత్తి మీద సాము లాంటిది. అరకొర జీతాలతో బండి లాక్కొస్తున్న మీడియా సోదరులకు ఇప్పుడు ఈ కరోనాభారిన పడడం ఆందోళన కలిగించే అమాసమే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: