రాష్ట్రంలో అలా లాక్ డౌన్ వేడి చల్లారిందో లేదో..రాజకీయ సెగలు ఎగిసి పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ ఉండటం మనం గమనిస్తున్నాం. కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ ఆరోపణలు చేయడం అరెస్ట్ అవ్వడం కూడా గతంలో మనం చూశాం..ఇప్పుడు ఈ ఆరోపణలకు అనుగుణంగా కేటీఆర్ కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నుండి జీఓ 111 ను ఉల్లంఘించిన మూలాన నోటీసులు కూడా దక్కాయి. అసలు ఏం జరుగుతుంది, కేటీఆర్ కి నోటీసులు ఎందుకు దక్కాయి. రేవంత్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత మేరకు ఉంది..? మధ్యలో జీఓ 111 ఏంటి..?

 

టీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ హైదరబాద్ నగర శివార్లలోని జన్వాడ లో లీజుకి తీసుకొని కట్టిస్తున్న ఫార్మ్ హౌజ్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తలచు ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. కేటీఆర్ ఫార్మ్ హౌజ్ నిర్మిస్తున్న ప్రాంతం గృహ నిర్మానికి సరైన ప్రాంతం కాదని, ఆ ప్రాంతంలో ఫామ్ హౌజ్ నిర్మిస్తుండటంతో జీఓ 111కి ఉల్లంఘన జరిగిదని తన వాధనని వినిపిస్తున్నాడు. ఈ మేరకు గతంలో ఓ మీడియా టీంతో ఆ ప్రాంతానికి వెళ్ళి డ్రోన్ ల సాయంతో ఫోటోలు తీయించి ఈ మ్యాటర్ ని మీడియా ద్వారా ప్రజలకి తెలియజేశాడు. ఈ పని చేసినందుకు కేటీఆర్ తన వ్యక్తిగత ప్రాంతాన్ని పెర్మిషన్ లేకుండా చిత్రీకరించినందుకు రేవంత్ పై కేసు కూడా నమోదు చేయించాడు.. దాంతో రేవంత్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడే మళ్ళీ రేవంత్ రెడ్డి అదే టాపిక్ ని తిరిగి ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు.. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేశాడు.. రేవంత్ ఫిర్యాదులు సేకరించిన సంస్థ కేటీఆర్ ఫామ్ హౌజ్ పై తగిన విచారణ జరిపించాలని వాస్తవాలను వెలికి తీసేందుకు ఓ టీంని సిద్ధం చేసింది.. ఆ టీమ్ లో తెలంగాణ పీసీబీ, జి‌హెచ్‌ఎం‌సి కమిషనర్, హెచ్‌ఎం‌డి‌ఏ కమిషనర్ మరియు ప్రిన్సిపాల్ సెక్రెట్రీ లని నియామకం చేసింది.. 2 నెలల సమయం కేటాయించి వాస్తవాలని తెలియజేయాయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

దీనికి స్పందించిన టీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, కన్నె ప్రభాకర్ లు రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.. రేవంత్ అన్నీ వెన్ను లేని వాధనలు ఆరోపణలు చేస్తాడని.. రేవంత్ మాటల్లో వాస్తవాలు లేవని తేల్చి చెబుతున్నారు. ఫామ్ హౌజ్ నిర్మాణం వల్లా ఎలాంటి జీఓ ఉల్లంఘన జరగలేదని త్వరలో నిజనిజాలు బయట పడతాయని తమ వాధానాలు వినిపిస్తున్నారు. పైగా రేవంత్ బావ మరిది జయా ప్రకాష్ రెడ్డి సర్వే నంబర్ 66 లో నియమాలను ఉల్లంఘించి నిర్మాణం చేశాడని అంతేకాక స్వయంగా రేవంత్ రెడ్డి గోపనపల్లి లో దళితుల భూములూ ఆక్రమించాడని ఇవన్నీ వాస్తవాలు కావా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.. మేము కూడా ఎదురించగలం అని ఆధారాలతో తిరిగి వస్తామని తమ ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: