ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాదులు.. అన్నిటికీ లేవు మందులు..! క్యాన్సర్ తో పోరాడాలంటే ద్రుడమైన సకల్పం విశ్వాసం కుటుంబ ప్రేమలు తప్పనిసరి అని చెబుతారు వైద్యులు. అలాగే కరోనాని ఎదుర్కోవాలంటే కూడా వైద్యంతో పాటు ద్రుడమైన సంకల్పం నమ్మకం మరియు ప్రేమ తప్పనిసరి అని చెబుతున్నాడు ముకుల్ గార్గ్. అసలు ఎవరీ ముకుల్ గార్గ్..? అసలు ముకుల్ గార్గ్ కథ ఏమిటి..? ముకుల్ గార్గ్ ఏం సాధించాడు అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా..

 

వైద్య శాస్త్రంలో ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నా ఈనాటికీ ఎన్నో వ్యాదులకు మందులు కనిపెట్టలేకపోయారు వైద్యులు. కొన్ని వ్యాదులు శాస్త్రవేత్తలు సైతం తల పట్టుకునేలా చేస్తున్నాయి. అందులో కరోనా మహమ్మారి ఒకటి. కరోన వ్యాదికి మందు కనిపెట్టడానికి ఎన్ని దేశాలు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ దేశం నుండి సరైన మందు బయటకు రాలేకపోయింది. ఎన్ని ప్రాణాలు బలైపోతున్న కరోన వ్యాప్తి విజృంబన తగ్గడం లేదు. కుటుంబంలో ఏ ఒక్కరికీ కరోనా వచ్చినా అది కుటుంబాన్ని అంతా బలి చేసేస్తుంది.. ఇదే తరహాలో ఢిల్లీ లోని ఓ వ్యాపారి ముకుల్ గార్గ్ కుటుంబంలో దాదాపుగా 17 మందికి కరోనా సోకింది, ముకుల్ గార్గ్ ది ఉమ్మడి కుటుంబం తన ఇంట్లో 2 ఏళ్ల వయాసు నుండి 90 ఏళ్ల పండు ముసలి వరకు అన్నీ రకాల వయసు గల వాళ్ళు ఉన్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరికీ కరోనా సోకింది కానీ అద్భుతం ఏంటంటే ఏ ఒక్కరూ మరణించలేదు.

 

గార్గ్ కుటుంబం అంతా ఓ మూడు అంతస్తుల భవనంలో ఉంటుంది. ముందుగా ఏప్రిల్ 24 న గార్గ్ బాబాయికి జ్వరంతో  పాటు జలుబు చేసింది.. జ్వరమే కదా వచ్చింది అని కొంత నిర్లక్ష్యం వహించారు, అదే రాత్రి కుటుంబంలో మరో ఇద్దరు దగ్గడం ప్రారంభించారు సరిగ్గా రెండు రోజులు అయ్యేపాటికి ముగ్గురికి జ్వరం తీవ్రత పెరగటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అది కరోనా అని రుజువైంది.. కరోనా విజృంబన బయటకన్నా ఇంటి లోపాలే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు ఇదే రీతిలో రోజులు గడుస్తున్నా కొద్ది ఆ ఇంటిలోని 17 మందికి ఒక్కొక్కరిగా కరోన సోకింది. గార్గ్ ఎంతగానో చింతించాడు.. ఎందరో డాక్టర్లతో గంటలకొద్ది ఫోన్ లో సంభాషణలు చేశాడు. బ్లాగ్ లు వ్యాసాలు రాశి ప్రజల ద్వారా సహాయం పొందేందుకు ప్రయత్నించాడు, చివరికి గార్గ్ కి తెలిసిందల్లా ఒక్కటే ఈ వ్యాదికి మందు ఒక్కటే కాకుండా విశ్వాసం ప్రేమ దైర్యం తప్పనిసరి అని. ఇక తన ఇంటినే ఓ కరోనా వార్డుగా మార్చేశాడు ఇంటిల్లిపాది అందరూ కలిసి దైర్యంతో సంకల్పంతో విశ్వాసంతో ఎంతో అన్యోన్యంగా గడపసాగారు. పెద్దవారికి చిన్నవాళ్లు నర్సుల్లా మారారు వారికివారే తోడుగా అండగా నిలిచారు మంచి ఆహారం మనో దైర్యం కుటుంబ ప్రేమల తాకిడికి మహమ్మారి సైతం కొట్టుకుపోయింది. మే నేలంతా ఆ కుటుంబం కరోనాతో గట్టి పోరాటం చేసింది మే నెలలో కొందరికి నెగిటివ్ రిజల్టులు రాగా జూన్ 1 న ఆ కుటుంబం లోని ప్రతి ఒక్కరికీ నెగిటివ్ రావటం వారినే కాదు యావత్ దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ 1 న మూడవ సారి టెస్ట్ చేయగా మూడవ సారి కూడా నెగిటివ్ రావడంతో ఆ కుటుంబం ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తుంది. ఈ పూర్తి కథ ఎందరికో విశ్వాసాన్ని నింపుతుంది అనే భావనతో గార్గ్ వ్యాసాన్ని వ్రాసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు.. తన వ్యాసానికి భారీ స్పందన హర్షం లబిస్తుంది. క్యాన్సర్ ఏ కాదు ఎలాంటి వ్యదైనా ఆకరికి కరోనా లాంటి మహమ్మారి అయినా మనలోని ప్రేమ దైర్యం విశ్వాసాన్ని చూసి పారిపోవాల్సిందే అని గార్గ్ కుటుంబం నిరూపించింది.g

మరింత సమాచారం తెలుసుకోండి: